Sun Dec 08 2024 06:56:19 GMT+0000 (Coordinated Universal Time)
మంచు సోదరుల మధ్య బయటపడిన విభేదాలు.. మనోజ్ ఇంటిపై దాడి ?
తాజాగా బయటికొచ్చిన ఓ వీడియో ఆ వార్తలకు బలం చేకూర్చినట్టయింది. మనోజ్ ఇంటిపైకి మంచు విష్ణు వెళ్లి దాడిచేసినట్లు..
మంచు మోహన్ బాబు కుమారులైన మంచు విష్ణు, మంచు మనోజ్ ల మధ్య విభేదాలు బయటపడ్డాయి. మనోజ్ పెళ్లి సమయంలోనే విష్ణు దంపతులు సరిగ్గా కనిపించపోవడంతో.. ఇద్దరి మధ్య విభేదాలున్నాయంటూ వార్తలొచ్చాయి. తాజాగా బయటికొచ్చిన ఓ వీడియో ఆ వార్తలకు బలం చేకూర్చినట్టయింది. మనోజ్ ఇంటిపైకి మంచు విష్ణు వెళ్లి దాడిచేసినట్లు సమాచారం. ఈ మేరకు మంచు మనోజ్, విష్ణు లకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
ఆ వీడియోలో మంచు విష్ణు కనిపించాడు. వాడేదో అన్నాడు కదా ఒరేయ్ అరేయ్ అని ఏదో అంటున్నాడు కదా ? అని విష్ణు అంటుంటే..అతడిని ఆపేందుకు బంధువులు ప్రయత్నిస్తున్నారు. ఇదిగో ఇలా ఇంటి మీదకు వచ్చి అందరినీ కొడుతూ ఉంటాడండి. ఇదీ పరిస్థితి అంటూ వీడియోలో మనోజ్ వాయిస్ వినిపిస్తుంది. అయితే.. ఇది ఎప్పుడు జరిగింది ? సరదాకి ఈ వీడియోను పోస్ట్ చేశారా ? లేక నిజంగానే ఇద్దరూ గొడవ పడుతున్నారా ? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
Next Story