Fri Dec 05 2025 17:49:31 GMT+0000 (Coordinated Universal Time)
Viswambhara : విశ్వంభర అప్పుడైనా విడుదలవుతుందా? మళ్లీ నిరాశపర్చరుగా?
మెగా స్టార్ చిరంజీవి నటించిన విశ్వంభర సినిమా కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

మెగా స్టార్ చిరంజీవి సినిమా కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సిల్వర్ స్క్రీన్ పై చిరంజీవిని చూడాలని తహతహలాడిపోతున్నారు. చిరంజీవి నటించిన సినిమా చూసి చాలా రోజులు కావస్తుండటంతో తాజా చిత్రం విశ్వంభర కోసం కళ్లు కాయలు కాచేలా వెయిట్ చేస్తున్నారు. కానీ విశ్వంభర సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్నప్పటికీ ఇప్పటి వరకూ విడుదలకు నోచుకోలేదు. యూవీ క్రియేషన్స్ పై విక్రమ్ , వంశీ, ప్రమోద నిర్మిస్తున్న విశ్వంభర మొన్నటి సంక్రాంతికి విడుదల కావాల్సి ఉంది. కానీ నాడు గేమ్ ఛేంజర్ సినిమా విడుదల ఉండటంతో వాయిదా వేశారు మేకర్స్,
ఏడు నెలల నుంచి...
ఇక ఏడు నెలల నుంచి విశ్వంభరకు డేట్స్ సరిగా కుదరడం లేదు. ఎప్పుడూ ఏదో ఒక ఆటంకం రావడం, పోస్టు ప్రొడక్షన్ పనులు ఇంకా పూర్తి కాలేదని, కొన్ని రోజులు ఇలా రిలీజ్ ను వాయిదా వేసుకుంటూ వస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన గ్లింప్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే మరో స్పెషల్ సాంగ్స్ ను చిత్రీకరించాల్సి ఉందని మేకర్స్ చెబుతున్నారు. ఈ పాటలో చిరంజీవితో పాటు బాలీవుడ్ నటి మౌనీరాయ్ కనిపిస్తారన్న ప్రచారం టాలీవుడ్ లో జరుగుతుంది. రీమిక్సింగ్ పాట ఒకటి విశ్వంభరలో పెడతారన్న టాక్ కూడా ఉంది.
సెప్టంబరు 18న...
ఈ చిత్రాన్ని సెప్టంబరు 18వ తేదీన విడుదల చేయాలన్న ఉద్దేశ్యంతో నిర్మాతలు ఉన్నారు. అన్ని పనులు పూర్తయితే ఇక వాయిదా వేయమని, సెప్టంబరు 18న రిలీజ్ కు సిద్ధం చేస్తామని చెబుతున్నారు. సోషియో ఫాంటసీ యాక్షన్ అడ్వెంచరస్ గా రూపుదిద్దుకున్న ఈ సినిమాకు విశిష్ట దర్శకత్వం వహిస్తున్నారు. హీరోయిన్ గా త్రిష నటిస్తున్నారు. మరోవైపు ఆషికా రంగనాధ్, కునాల్ కపూర్ లో కీలక పాత్ర పోషిస్తున్నారు. సెప్టంబరు 18న రిలీజ్ డేట్ అన్ అఫియల్ గా చెబుతున్నారు. మరి అప్పుడైనా మెగా ఫ్యాన్స్ ఆశలకు తెరపడుతుందేమో చూడాలి.
Next Story

