Wed Mar 18 2026 04:07:31 GMT+0530 (India Standard Time)
SS Rajamouli : తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డ రాజమౌళి కుటుంబం
ప్రముఖ దర్శకుడు రాజమౌళి కుటుంబానికి పెద్ద ప్రమాదం తప్పింది.

ప్రముఖ దర్శకుడు రాజమౌళి కుటుంబానికి పెద్ద ప్రమాదం తప్పింది. జపాన్ లో పర్యటిస్తున్న ఆ కుటుంబం భూకంపం బారి నుంచి తృటిలో తప్పించుకుంది. ఈ విషయాన్ని రాజమౌళి కుమారుడు కార్తికేయ ఎక్స్ లో వెల్లడించడంతో బాహ్య ప్రపంచానికి వెల్లడయింది. రాజమౌళి తన కుటుంబంతో కలసి జపాన్ లో పర్యటిస్తున్నారు.
హోటల్ లో ఉండగా...
జపాన్ లో ఒక హోటల్ లో ఉన్నారు. హోటల్ లో 28వ అంతస్థులో రాజమౌళి కుటుంబం ఉండగా భూకంపం సంభవించింది. దీంతో వారు భయపడ్డారని, అయితే స్వల్ప భూకంపం కావడంతో ప్రమాదమేమీ జరగలేదని, భూకంప తీవ్రతతో తాము భయపడ్డామని రాజమౌళి కుమారుడు కార్తికేయ తెలిపారు.
Next Story

