నెంబర్ వన్ లో ఫ్యామిలీ మ్యాన్
పాన్ ఇండియా వెబ్ సీరీస్ ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సీరీస్ పై ఎన్ని అంచనాలు, ఎంత క్రేజ్ ఉందో.. ఆ ట్రైలర్ రిలీజ్ అవకముందు నుండే చూస్తున్నాం. [more]
పాన్ ఇండియా వెబ్ సీరీస్ ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సీరీస్ పై ఎన్ని అంచనాలు, ఎంత క్రేజ్ ఉందో.. ఆ ట్రైలర్ రిలీజ్ అవకముందు నుండే చూస్తున్నాం. [more]
పాన్ ఇండియా వెబ్ సీరీస్ ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సీరీస్ పై ఎన్ని అంచనాలు, ఎంత క్రేజ్ ఉందో.. ఆ ట్రైలర్ రిలీజ్ అవకముందు నుండే చూస్తున్నాం. రాజ్ అండ్ డీకే లు ఫ్యామిలీ మ్యాన్ సీజన్ వన్ తో సెన్సేషన్ క్రియేట్ చేసి సీజన్ 2 పై అంచనాలు పెంచేశారు. మనోజ్ బాజ్ పేయీ ఎప్పటిలాగే అదిరిపోయే యాక్షన్ తో ఆకట్టుకోగా.. సమంత స్పెషల్ అట్రాక్షన్ అవుతుంది అనుకుంటే పొరబాటే. ఎందుకంటే ఈ వెబ్ సీరీస్ కి బ్యాక్ బోన్ సమంత అవ్వబోతుంది కాదు.. అవుతుంది. సమంత క్రేజ్, ఆమె పాపులారిటీ ఈ వెబ్ సీరీస్ పై చాలా ఉంది. ఈ సీరీస్ కోసం కోట్లాది ప్రేక్షకులు వెయిటింగ్.
రీసెంట్ గా విడుదలైన ఫ్యామిలీ మ్యాన్ ట్రైలర్ యూట్యూబ్‌లో 24 గంటల్లో.. 15 మిలియన్ల వ్యూస్, 500k లైక్స్‌ను సాధించింది. ఫ్యామిలీ మ్యాన్ క్రేజ్ దెబ్బకి నెంబర్ వన్ పొజిషన్ లో ఉన్న మీర్జాపూర్ 2 రెండో స్థానంలోకి పడిపోయింది. దానితో ఫామిలీ మ్యాన్ సీజన్ 2 ట్రైలర్ ఇండియన్ ఓటీటీ హిస్టరీలోనే సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసినట్టు కనిపిస్తోంది. సమంత డిఫ్రెంట్ రోల్ ప్లే చెయ్యడం.. ఫామిలీ మ్యాన్ స్టోరీ నార్త్ నుండి సౌత్ చెన్నై కి షిఫ్ట్ అవడం, సీజన్1 బ్లాక్ బస్టర్ కావడంతో సీజన్ 2 పై అంతకంతకు అంచనాలు ఆసక్తి పెరిగిపోతుంది. మరి జూన్ 4 న అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ కాబోతున్న ఫామిలీ మ్యాన్ 2 వెబ్ సీరీస్ మరిన్ని రికార్డులని క్రియేట్ చేస్తుందో చూడాలి.