Sun Jul 20 2025 06:55:16 GMT+0000 (Coordinated Universal Time)
SSMB29 పై ప్రియాంక ఇంత హోప్స్ పెట్టుకున్నారా?
దర్శక ధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు నటంచిన SSMB29 ప్రాజెక్టుపై ఎవరికి మాత్రం ఆసక్తి ఉండదు.

దర్శక ధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు నటంచిన SSMB29 ప్రాజెక్టుపై ఎవరికి మాత్రం ఆసక్తి ఉండదు. మరోసారి టాలీవుడ్, బాలీవుడ్ చరిత్రను తిరగ రాస్తుందని ఇప్పటికే మూవీపై బజ్ ఏర్పడింది. ఇప్పుడున్న రికార్డులన్నీ ఈ మూవీతో చెదిరిపోతాయని కూడా అభిమానులు నమ్మకంతో ఉన్నారు. రాజమౌళి దర్శకత్వం వహిస్తూ మహేష్ బాబు నటించనున్న ఈ మూవీపై ఇప్పటికే అంచనాలు మామూలుగా లేవు. అందుకే ఈ మూవీకి సంబంధించి ఏం అప్ డేట్ వచ్చినా, ఎవరు మాట్లాడినా అది సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది.
ఇద్దరి కాంబినేషన్ లో...
RRR మూవీతో అంతర్జాతీయంగా ప్రశంసలు అందుకున్న రాజమౌళి ఈ చిత్రాన్ని కూడా అదే రేంజ్ లో తెరకెక్కిస్తున్నారన్న వార్తలు టాలీవుడ్ ను ఊపేస్తున్నాయి. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. రామోజీ ఫిల్మ్ సిటీలో వారణాసి సెట్ వేసి మరీ షూటింగ్ ను నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. రాజమౌళి సిల్వర్ స్క్రీన్ పై డ్రీమ్ బాయ్ మహేష్ బాబును ఏ విధంగా చూపుతారన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఈ ఇద్దరి కాంబినేషన్ లో వస్తున్న తొలి మూవీ కావడంతో భారీగా హైప్ క్రియేట్ అయింది.
తాజా ఇంటర్వ్యూలో...
అయితే మహేష్ బాబుతో పాటు ఈ చిత్రంలో ప్రియాంకచోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ముఖ్యపాత్రల్లో నటించనున్నారని తేలింది. ప్రియాంక ఇప్పటికే షూటింగ్ లో కూడా పాల్గొనడంతో పాటు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ ఏడాది ఒక పాన్ ఇండియా ఇండియన్ మూవీలో నటిస్తున్నానని అన్నారు. ఇప్పటికే తాను ఇండియా సినిమాలు, ఆడియన్స్ ను మిస్ అవుతున్నానని, మళ్లీ ఇక్కడి ప్రేక్షకులతో కనెక్ట్ అవుతున్నానని ఆమె చెప్పడంతో SSMB29 గురించి అని అంటున్నారు. అడ్వెంచర్ మూవీగా తెరకెక్కే ఈ మూవీ తదుపరి షెడ్యూల్ జులై రెండో వారంలో కెన్యాలో ప్రారంభం కానుందని తెలిసింది. యాక్షన్, ఛేజింగ్ ఎపిసోడ్స్ ను చిత్రీకరించేందుకు రాజమౌళి కెన్యాను ఎంచుకున్నారు. మొత్తం మీద ప్రియాంక ఇచ్చిన ఇంటర్వ్యూ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.
Next Story