Wed May 21 2025 05:18:24 GMT+0000 (Coordinated Universal Time)
Mahesh Babbu : మహేశ్ బాబు ఫ్యాన్స్ కు నెంబర్ 1 న్యూస్.. ఇక ఆగరేమో?
సూపర్ స్టార్ మహేశ్ బాబు అభిమానులకు అదిరిపోయే న్యూస్. మరో సక్సెస్ ఫుల్ దర్శకుడితో మూవీ చేయడానికి మహేశ్ బాబు ఓకే చెప్పినట్లు తెలిసింది

సూపర్ స్టార్ మహేశ్ బాబు అభిమానులకు అదిరిపోయే న్యూస్. మరో సక్సెస్ ఫుల్ దర్శకుడితో మూవీ చేయడానికి మహేశ్ బాబు ఓకే చెప్పినట్లు తెలిసింది. దీంతో వరసగా మహేశ్ బాబు సినిమాలు హిట్ లు మీద హిట్ లు కొడతాయని భావిస్తున్నారు. ఇప్పటికే మహేశ్ బాబు పాన్ ఇండియా దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో SSMB 29 సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఖచ్చితంగా బాక్సాఫీస్ అన్ని రికార్డులను బద్దలు కొట్టేస్తుందని చెబుతున్నారు. గతంలో ఉన్న రికార్డులను తిరగరాస్తుందన్న నమ్మకంతో మహేశ్ బాబు ఫ్యాన్స్ ఉన్నారు.
ఉప్పెనలా దూసుకొచ్చి...
ఇక తాజాగా అందుతున్న సమాచారం ఏంటంటే రాజమౌళి మూవీ పూర్తయిన వెంటనే మహేశ్ బాబు మరో సినిమాకు కు కూడా సైన్ చేస్తారన్నది టాలీవుడ్ వర్గాల టాక్. ఉప్పెనతో చిత్ర పరిశ్రమలో ఉప్పెనలా దూసుకు వచ్చిన బుచ్చిబాబు దర్శకత్వంలో ఒక కొత్త మూవీని మహేశ్ బాబు చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు బుచ్చిబాబు చెప్పిన కథకు మహేశ్ బాబు ఓకే చెప్పారని అంటున్నారు. కథ కూడా నచ్చడంతో మహేశ్ వెంటనే ఓకే చెప్పేశారని, అయితే ఇద్దరి చేతిలో ఉన్న సినిమాలు పూర్తయిన వెంటనే ఈ మూవీ షూటింగ్ ప్రారంభమవుతుందంటున్నారు.
గతంలో ఉన్న పరిచయంతో...
మహేశ్ బాబు గతంలో సుకుమార్ దర్శకత్వంలో నటించిన నెంబరు 1 మూవీకి బుచ్చిబాబు అసిస్టెంట్ డైరెక్టర్ గా వ్యవహరించారు. ఈ చనువుతో పాటు బుచ్చిబాబు టేకింగ్, కథ, దర్శకత్వంపై నమ్మకం ఉన్న మహేశ్ బాబు మంచి కథతో రావాలని చెప్పడంతో ప్రస్తుతం రామచరణ్ తో తీస్తున్న పెద్ది మూవీ షూటింగ్ బ్రేక్ లో బుచ్చిబాబు మహేశ్ బాబుకు కథ వినిపించడం ఆయన ఓకే చెప్పడం చకా చకా జరిగిపోయినట్లు టాక్ ఉంది. మహేశ్ బాబు రాజమౌళి సినిమా, బుచ్చిబాబు పెద్ది మూవీ పూర్తయిన వెంటనే ఈ మూవీ కి క్లాప్ కొడతారంటున్నారు. సో.. ఇది మహేశ్ బాబు ఫ్యాన్స్ కు ఖచ్చితంగా గుడ్ న్యూసే కదా?
Next Story