Sun Dec 14 2025 01:58:34 GMT+0000 (Coordinated Universal Time)
కన్నుమూసిన నటి రాజేశ్వరి
బుధవారం రాత్రి రాజేశ్వరి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో వెంటనే ఆమెను ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు

ప్రముఖ ఒడియా బుల్లితెర నటి రాజేశ్వరి రే మోహపాత్ర కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆమె మెదడు, ఊరిపితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతుండగా భవనేశ్వర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో పరిస్థితి విషమించడంతో బుధవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆమె మృతి పట్ల సినీ ప్రముఖులు,అభిమానులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేస్తున్నారు.'స్వాభిమానం' అనే ఒడియా సీరియల్‌తో మహాపాత్ర మంచి గుర్తింపు పొందారు.
బుధవారం రాత్రి రాజేశ్వరి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో వెంటనే ఆమెను ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అయితే అత్యవసర చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. 2019లో, రాజేశ్వరి తనకు క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయిందని, దాని నుండి తాను కోలుకుంటానని ట్వీట్ చేసింది.
ఒడిశాలోని టెలి సీరియల్ పరిశ్రమలో సుప్రసిద్ధ ముఖమైన రాజేశ్వరి తన నటనతో ఎంతో మంది ప్రేమ, ప్రశంసలను పొందింది. Uansi Kanya వంటి అనేక సీరియల్స్‌లో తన ఆకట్టుకునే నటనతో మెప్పించింది. రాజేశ్వరి ఒడియా టెలి ఇండస్ట్రీలో యాంకర్‌గా తన ప్రయాణాన్ని ప్రారంభించింది. తరువాత అనేక సీరియల్స్‌లో నటించింది. రాజేశ్వరి మృతి పట్ల పలువురు ఒడియా నటులు సంతాపం తెలిపారు. ఆమె అకాల మరణాన్ని విని దిగ్భ్రాంతికి గురయ్యామని చెప్పారు. "మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన తర్వాత కూడా ఆమె తన ప్రతిభతో తనను తాను నిరూపించుకుంది. క్యాన్సర్‌తో పోరాడుతున్న సమయంలో ఆమె సహనం చాలా ప్రశంసనీయం. ఆమె అకాల మరణంతో మేము చాలా బాధలో మునిగిపోయాం, "అని నటి బంధువు అశోక్ కుమార్ భూయాన్ అన్నారు.
News Summary - Eminent Odia tele actress Rajeswari Ray Mohapatra no more
Next Story

