Fri Dec 05 2025 13:19:14 GMT+0000 (Coordinated Universal Time)
రాధేశ్యామ్ అప్డేట్ : "ఈ రాతలే" వీడియో సాంగ్ విడుదల
దర్శకుడు రాధాకృష్ణ.. హీరో హీరోయిన్ల మధ్య లవ్ ట్రాక్ ను ఎంత క్యూట్ అండ్ రొమాంటిక్ గా చిత్రీకరించారో..

హైదరాబాద్ : ప్రభాస్ - పూజా హెగ్డే హీరో, హీరోయిన్లుగా వస్తోన్న రొమాంటిక్ ఎమోషనల్ లవ్ ఎంటర్టైనర్ రాధేశ్యామ్. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై పీరియాడిక్ లవ్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా మార్చి 11న గ్రాండ్ రిలీజ్ కు సిద్ధమవుతోంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో మేకర్స్ ప్రమోషన్స్ ను షురూ చేశారు. అందులో భాగంగా ఈ సినిమా నుంచి "ఈ రాతలే" వీడియో సాంగ్ ను విడుదల చేశారు. ఈ పాట చాలా రొమాంటిక్ గా ఉంది. సినిమాలో పూజా - ప్రభాస్ ల మధ్య ప్రేమ ఎలా పుడుతుందో ఈ పాటను చూస్తే ఇట్టే అర్థం అవుతుంది.
దర్శకుడు రాధాకృష్ణ.. హీరో హీరోయిన్ల మధ్య లవ్ ట్రాక్ ను ఎంత క్యూట్ అండ్ రొమాంటిక్ గా చిత్రీకరించారో.. అంతే ఎమోషన్ ను కూడా చూపించనున్నట్లు తెలుస్తోంది. పాట విషయానికొస్తే.. "ఈ రాతలే" వీడియో సాంగ్ లో ప్రభాస్ సూపర్ కూల్ గా కనిపించారు. రెబల్ స్టార్ కాస్తా.. సూపర్ కూల్ స్టార్ అయ్యారని చెప్పొచ్చు. పూజా హెగ్డే గ్లామర్ గురించైతే చెప్పనక్కర్లేదు. మొత్తం మీద "ఈ రాతలే" వీడియో సాంగ్ ప్రభాస్ - పూజా ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ మనసులు దోచేసింది. కృష్ణకాంత్ రచించిన ఈ పాటను మ్యూజిక్ డైరెక్టర్ జస్టిన్ ప్రభాకర్ కంపోజ్ చేయగా.. యువన్ శంకర్ రాజ్, హరిణి ఆలపించారు.
News Summary - EE Rathale Video Song Out from Radhe Shyam
Next Story

