Mon Mar 16 2026 04:26:25 GMT+0530 (India Standard Time)
టాలీవుడ్ లో మరో విషాదం
ఎడిటర్ జి.జి కృష్ణారావు ఈరోజు ఉదయం బెంగళూరులో మరణించారు. ఆయన దాదాపు 200 సినిమాలకు ఎడిటర్ గా పనిచేశారు

టాలీవుడ్ ను వరస విషాదాలు వెంటాడుతున్నాయి. అనేక మంది టాలీవుడ్ కు చెందిన నిర్మాతలు, దర్శకులు, నటులు మృతి చెందుతున్నారు. తాజాగా ఎడిటర్ జి.జి కృష్ణారావు ఈరోజు ఉదయం బెంగళూరులో మరణించారు. ఆయన దాదాపు 200 సినిమాలకు ఎడిటర్ గా పనిచేశారు. నిర్మాతగానూ పలు చిత్రాలకు కృష్ణారావు వ్యవహరించారు.
200 చిత్రాలకు....
ముఖ్యంగా కె. విశ్వనాథ్, దాసరి నారాయణరావు సినిమాలకు ఆయన ఎడిటర్ గా బాధ్యతలను నిర్వహించారు. కె. విశ్వనాధ్ దర్శకత్వంలో విడుదలయిన శంకరాభరణం, సాగర సంగమం, స్వాతిముత్యం, శుభలేఖ చిత్రాలకు, దాసరి నారాయణరావు దర్శకత్వంలో నిర్మితమైన బొబ్బిలిపులి, సర్దార్ పాపారాయుడు వంటి చిత్రాలకు ఎడిటర్ గా బాధ్యతలను నిర్వహించారు. కృష్ణారావు మృతితో టాలీవుడ్ లో విషాదం నెలకొంది. ఆయన మృతిపట్ల పలువురు సంతాపాన్ని ప్రకటించారు.
Next Story

