Sun Mar 08 2026 14:25:27 GMT+0530 (India Standard Time)
విషమంగానే శరత్‌బాబు ఆరోగ్యం
సీనియర్ నటుడు శరత్ బాబు ఆరోగ్యం విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు

సీనియర్ నటుడు శరత్ బాబు ఆరోగ్యం విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు. ఆయన మూడు రోజుల క్రితం హైదరాబాద్‌లోని ఏఎంజీ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందారు. 71 ఏళ్ల శరత్ బాబుకు తీవ్ర అనారోగ్యం పాలవ్వడంతో వెంటనే కుటుంబ సభ్యులు హైదరాబాద్‌కు తీసుకు వచ్చి ఏఎంజీ ఆసుపత్రిలో చేర్పించారు.
మూడు రోజుల క్రితం...
గత మూడు రోజుల నుంచి ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఆయన శరీరం మొత్తం సెప్సిస్ కావడంతో కిడ్నీలు, ఊపిరితిత్తులు, కాలేయం వంటి ప్రధాన అవయవాలపై పడినట్లు వైద్యులు చెబుతున్నారు. ఆయనకు ఐసీయూలో వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు.
Next Story

