Tue Dec 16 2025 02:28:21 GMT+0000 (Coordinated Universal Time)
పవన్ పై తమ్మారెడ్డి విమర్శలు.. ఆయన వల్లే ఆ సినిమా ప్లాప్
పవన్ కల్యాణ్ వల్లనే ఆ సినిమా వసూళ్ల పరంగా ప్లాప్ అయిందని ప్రముఖ దర్శకుడు తమ్మారెడ్డి భరధ్వాజ అన్నారు.

పవన్ కల్యాణ్ వల్లనే ఆ సినిమా వసూళ్ల పరంగా ప్లాప్ అయిందని ప్రముఖ దర్శకుడు తమ్మారెడ్డి భరధ్వాజ అన్నారు. ఈ ఏడాది అక్టోబరు 1న విడుదలయిన రిపబ్లిక్ మూవీ కమర్షియల్ గా హిట్ కాకపోవడానికి పవన్ కల్యాణ్ వ్యాఖ్యలే కారణమని ఆయన అన్నారు. సాయిధరమ్ తేజ్ నటించిన ఈ చిత్రం ఈవెంట్ లో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం వల్ల ఆ సినిమా నిర్మాత నష్టపోయారని తమ్మారెడ్డి భరధ్వాజ అన్నారు.
పార్టీ కార్యలయంలో.....
పవన్ కల్యాణ్ సినిమా ఈవెంట్ లో కాకుండా పార్టీ ఆఫీసులో ఈ వ్యాఖ్యలు చేసి ఉంటే బాగుండేదని తమ్మారెడ్డి భరధ్వాజ అభిప్రాయపడ్డారు. ఈ విమర్శల కారణంగా సినిమా ఇండ్రస్ట్రీతో పాటు సినిమా కూడా నష్టపోయిందన్నారు. పవన్ కల్యాణ్ ఏపీ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం కావచ్చని, అయితే అది సినిమా ఈవెంట్ లో చెప్పి ఉండాల్సింది కాదన్నారు. పవన్ వ్యాఖ్యలతో సాయిధరమ్ తేజ్ భవిష్యత్ కూడా దెబ్బతినిందన్నారు. ఈ వ్యాఖ్యల వల్ల టికెట్ల రేట్ల సమస్య మరింత పెద్దదయిందని తమ్మారెడ్డి చెప్పారు.
Next Story

