Thu Mar 23 2023 11:40:32 GMT+0000 (Coordinated Universal Time)
ఎంజాయ్ చేయండి..తాగండి..తిరగండి: విద్యార్థులకు వర్మ సలహా
వైరస్ వచ్చి తాను తప్ప మగజాతి అంతా చచ్చిపోవాలని తన కోరిక అని దర్శకుడు రాంగోపాల్ వర్మ అన్నారు

వైరస్ వచ్చి తాను తప్ప మగజాతి అంతా చచ్చిపోవాలని తన కోరిక అని దర్శకుడు రాంగోపాల్ వర్మ అన్నారు. నాగార్జున యూనివర్సిటీలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న వర్మ అనేక వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. విద్యార్థులకు ఆర్జీవీ ఉచిత సలహాలు ఇచ్చారు. మగజాతి మొత్తం అంతరించి పోయి స్త్రీ జాతికి తానే దిక్కవ్వాలని ఆయన అన్నారు. నచ్చింది తినాలని, తాగాలని ఎంజాయ్ చేయాలంటూ విద్యార్థులకు సలహా ఇచ్చారు.
వీసీ వత్తాసు...
చనిపోయాక స్వర్గానికి వెళితే రంభ, ఊర్వశిలు ఉండకపోవచ్చని, అందుకే ఇక్కడే, ఇప్పుడే ఎంజాయ్ చేయాలని వర్మ విద్యార్థులకు పిలుపునిచ్చారు. వర్మ వ్యాఖ్యలకు యూనివర్సిటీ వైస్ ఛాన్సిలర్ కూడా వత్తాసు పలికారు. వర్మ ఒక ప్రొఫెసర్ ఫిలాసఫర్ కంటే ఎక్కువని నాగార్జున యూనివర్సిటీ వీసీ కూడా అనడం వివాదంగా మారింది. వర్మకు పీహెచ్డీ ఆస్కార్ కంటే ఎక్కువ అర్హతలున్నాయని వీసీ అన్నారు. వర్మ, వీసీ వ్యాఖ్యలతో సమావేశానికి హాజరైన వారు అవాక్కయ్యారు. విద్యార్థులు మాత్రం కేరింతలో వారి వ్యాఖ్యలను స్వాగతించారు.
Next Story