Fri Mar 21 2025 07:41:40 GMT+0000 (Coordinated Universal Time)
ఆర్జీవీ "డెత్" ట్వీట్స్ ... సంచలనమే
కాంట్రవర్సీకి రాంగోపాల్ వర్మ పేరు. తాజాగా ఆయన చావులపై ట్వీట్ చేశారు.

కాంట్రవర్సీకి రాంగోపాల్ వర్మ పేరు. ఆయన ఎప్పుడు ఏ ట్వీట్ చేసినా ఏదో ఒక వివాదం ఉంటుంది. ఆయన సమాజాన్ని పెద్దగా పట్టించుకోరు. తాను అనుకున్నది అనుకున్నట్లు ట్వీట్ చేయడం రాంగోపాల్ వర్మకు ఇష్టం. ఓడ్కా తాగుతూ ట్వీట్ చేసినా ఆయన తాను అనుకున్నది చెప్పేస్తారు. తాజాగా ఆయన చావులపై ట్వీట్ చేశారు.
RIP అంటే అవమానకరమే...
RIP అంటే అవమానమని రాంగోపాల్ వర్మ అభిప్రాయపడ్డారు. చనిపోయిన వారిని నేను ద్వేషిస్తున్నాను. వారు మణించారు. జీవించి ఉన్న వారికంటే మరణించిన వారికే మెరుగైన జీవితం ఉంటుంది. అమృతంతో పాటు రంభ మంచి మహిళ. ఇంద్రభవనం మంచి ఇల్లు. అందుకే త్వరగా చనిపోదాం అని రాంగోపాల్ వర్మ ట్వీట్ చేశారు. చావుకు భయపడేవాళ్లు తాము పాపం చేసినట్లు భావించబట్టే నరకానికి వెళ్లడానికి భయపడతారు. ఎవరైనా చనిపోయినా బాధపడకుండా ఆ చావును సెలబ్రేట్ చేసుకోండి అని ఆయన సలహా ఇచ్చారు. చనిపోయిన వారికి RIP చెప్పే బదులు హయిగా గడపండి. మరింత ఆనందించండి అని ట్వీట్ చేయడం సముచితమన్నారు.
Next Story