Sat Mar 07 2026 11:50:02 GMT+0530 (India Standard Time)
రాత్రి కలలో నాకు దేవుడు కన్పించాడు
దర్శకుడు రాంగోపాల్ వర్మ ట్వీట్లు చేస్తూ హీట్ పుట్టిస్తుంటారు. ఇటీవల కాలంలో ఆయన ట్వీట్లు సినిమా రంగానికే పరిమితి కాలేదు

దర్శకుడు రాంగోపాల్ వర్మ ట్వీట్లు చేస్తూ హీట్ పుట్టిస్తుంటారు. ఇటీవల కాలంలో ఆయన ట్వీట్లు సినిమా రంగానికే పరిమితి కాలేదు. రాజకీయాల్లో కూడా ఆయన ఫింగర్ పెట్టి కెలుకుతున్నాడు. తాజాగా రాంగోపాల్ వర్మ ట్వీట్ పవన్ కల్యాణ్ ను లక్ష్యంగా చేసినట్లుంది. పవన్ కల్యాణ్ అభిమాని అని చెబుతూనే ఆయనకు వ్యతిరేకంగా ట్వీట్లు చేయడం రాంగోపాల్ వర్మకు అలవాటుగా మారిపోయింది.
వెన్నుపోటు...
"ఆ నాడు జూలియస్ సీజర్ ని బ్రూటస్, ఎన్టీఆర్ ను నాదెండ్ల భాస్కరరావు, మళ్లీ ఎన్టీఆర్ ను చంద్రబాబు వెన్నుపోటు పొడిచినట్లే ఈసారి పవన్ కల్యాణ్ ను నాదెండ్ల మనోహర్, చంద్రబాబులు ఇద్దరూ కలసి వెన్నుపోటు పొడుస్తారని నాకు రాత్రి కలలో దేవుడు చెప్పాడు" అంటూ ట్వీట్ చేశాడు.
Next Story

