Mon Dec 15 2025 09:21:27 GMT+0000 (Coordinated Universal Time)
రియాల్టీకి మెగా దూరమవుతున్నారు: వర్మ సంచలన ట్వీట్
మెగా స్టార్ చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమా విడుదలైంది. ఈ సినిమా తమిళ మూవీ వేదాళం

మెగా స్టార్ చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమా విడుదలైంది. ఈ సినిమా తమిళ మూవీ వేదాళం రీమేక్ గా తెరకెక్కింది. అయితే ఈ సినిమా మొదటి ఆట నుండే ఫ్లాప్ టాక్ ను సొంతం చేసుకుంది. సినిమా మీద అభిమానులకు కనీసం ఇంట్రెస్ట్ లేకుండా పోయింది. దీంతో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా చిరంజీవి చుట్టూ ఉన్న వ్యక్తులు చేస్తున్న భజన కారణంగానే ఇలాంటి సినిమాకు బాస్ ఒప్పుకున్నారని కూడా అంటున్నారు. తాజాగా సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా రియాల్టీకి దూరం అవుతున్నారని చెప్పుకొచ్చారు.
‘‘జబర్, హైపర్ లాంటి ఆస్థాన విదూషకుల భజన పొగడ్తలకి అలవాటుపడిపోయి, రియాల్టీకి మెగా దూరమవుతున్నారని అనిపిస్తోంది. పొగడ్తలతో ముంచే వాళ్ళ బ్యాచ్ కన్నా ప్రమాదకరమైన వాళ్ళు వుండరు. రియాల్టీ తెలిసే లోపల రాజు గారు మునిగిపోతారు.. వాళ్ళ పొగడ్తల విషం నుంచి తప్పించుకోవాలంటే ఆ జాతిని మైల్ దూరం పెట్టటమే’’ అని ట్విట్టర్ వేదికగా కామెంట్లు చేశారు వర్మ.
“Of many a proud structure’s ruin , teeny weeny rain drops have been the cause “
—Philosopher Nietzsche అంటూ ఒక కొటేషన్ ను కూడా పెట్టారు వర్మ.
Next Story

