Fri Dec 05 2025 15:28:32 GMT+0000 (Coordinated Universal Time)
ఇండస్ట్రీకి చిరంజీవినే పెద్ద : రాజమౌళి
సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను సీఎం జగన్ కు చాలా ఓపికగా విన్నారని, సినిమా వారి కష్టాలపై

చిరంజీవి కాదన్నా తెలుగు సినీ పరిశ్రమకు ఆయనే పెద్ద అని దర్శకుడు రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో కొద్దిరోజులుగా సినిమా టికెట్ల రేట్ల పై చర్చ జరుగుతోంది. గత నెల ఈ విషయంపై చిరంజీవి సీఎం జగన్ తో భేటీ అయిన విషయం తెలిసిందే. తాజాగా.. టాలీవుడ్ అగ్రహీరోలైన చిరంజీవి, ప్రభాస్, మహేష్ బాబు లతో పాటు దర్శకులు రాజమౌళి, కొరటాల శివ, నటులు అలీ, పోసాని తదితరులు సీఎం జగన్ తో మరోమారు భేటీ అయ్యారు. జగన్ తో సమావేశం ముగిసిన అనంతరం సినీ పెద్దలు మీడియాతో మాట్లాడారు.
Also Read : మరో కొత్త వైరస్.. కేరళలో తొలి కేసు నమోదు
ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ.. సినిమా ఇండస్ట్రీకి చిరంజీవినే పెద్ద అని తేల్చేశారు. అలాగే సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను సీఎం జగన్ కు చాలా ఓపికగా విన్నారని, సినిమా వారి కష్టాలపై ఆయనకు అవగాహన ఉందని తెలిపారు. తమ సమస్యలను విని, వాటిని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తామన్న సీఎం జగన్ కు ఆయన మీడియాముఖంగా కృతజ్ఞతలు తెలిపారు. ఇండస్ట్రీకి పెద్ద చిరంజీవినే అంటే ఆయనకు నచ్చదు కానీ.. అదే నిజమన్నారు. కొన్ని నెలలుగా అసలు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటన్న పరిస్థితుల నేపథ్యంలో చిరంజీవి గారు ఇంత పెద్ద సమస్యను పరిష్కారం దిశగా తీసుకువెళుతున్నందుకు చిరంజీవి గారికి ధన్యవాదాలు' అంటూ చెప్పుకొచ్చారు రాజమౌళి.
Next Story

