Sat Oct 12 2024 06:09:04 GMT+0000 (Coordinated Universal Time)
Game Changer : 'గేమ్ ఛేంజర్' నుంచి గుడ్ న్యూస్ చెప్పిన దిల్ రాజు..
రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' నుంచి గుడ్ న్యూస్ చెప్పిన దిల్ రాజు. ఏంటంటే..!
Game Changer : ఆర్ఆర్ఆర్ తరువాత రామ్ చరణ్ ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర తో కలిసి చేస్తున్న సినిమా 'గేమ్ ఛేంజర్'. ఈ మూవీ అనౌన్స్మెంట్ తోనే ఇండస్ట్రీలో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. శంకర్ తన హిట్ ఫార్ములా అయిన కమర్షియల్ సోషల్ మెసేజ్ స్టోరీతో ఈ మూవీని తెరకెక్కిస్తుండడంతో.. ఆడియన్స్ తో పాటు ఇండస్ట్రీలోని ప్రముఖుల్లో కూడా ఈ సినిమా ఎప్పుడు చూస్తామా అనే క్యూరియాసిటీ క్రియేట్ అయ్యింది.
గత మూడేళ్ళుగా షూటింగ్ జరుపుకుంటూనే ఉన్న ఈ మూవీని ఈ ఏడాది ఎలాగైనా ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు. మరో మూడు నెలల్లో షూటింగ్ మొత్తం పూర్తి అవుతుందట. ఇది ఇలా ఉంటే, ఈ సినిమాని పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేస్తున్నారా లేదా అనే డౌట్ ఇటీవల ఆడియన్స్ లో క్రియేట్ అయ్యింది. ఎందుకంటే రీసెంట్ గా రిలీజ్ చేసిన 'జరగండి' సాంగ్ మూడు (తెలుగు, తమిళ్, హిందీ) భాషల్లోనే రిలీజ్ చేసారు.
దీంతో ఈ సినిమా పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కావడం లేదాని ఫ్యాన్స్ తెగ ఫీల్ అయ్యిపోయారు. ఎందుకంటే, పాన్ ఇండియా వైడ్ విడుదల అవుతే భారీ వసూళ్ళని నమోదు చేయొచ్చు. కానీ సాంగ్ ని మూడు భాషల్లోనే రిలీజ్ చేయడంతో ఫ్యాన్స్ దిగులు చెందారు. అయితే ఈ విషయం గురించి రీసెంట్ గా దిల్ రాజుని ప్రశ్నించగా, ఆయన బదులిస్తూ.. "గేమ్ ఛేంజర్ ని పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేస్తాం. డేట్ కూడా ఫిక్స్ అయ్యింది. శంకర్ గారు అనౌన్స్ చేస్తారు" అని చెప్పుకొచ్చారు.
ఇక ఈ గుడ్ న్యూస్ తో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. కాగా ఈ సినిమాని దీపావళి కానుకగా రిలీజ్ చేయబోతున్నారట. అక్టోబర్ 31న ఈ సినిమాని విడుదల చేయడానికి దర్శకనిర్మాతలు ఫిక్స్ అయ్యారట. త్వరలో ఈ తేదీని అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నారు.
Next Story