Fri Nov 08 2024 15:00:18 GMT+0000 (Coordinated Universal Time)
నాని "దసరా" నుంచి ధూమ్ ధామ్ లిరికల్ సాంగ్
ఇచ్చి పడేద్దాం .. గుచ్చి పడేద్దాం .. ఎవ్వడడ్డమొత్తడో చూద్దాం .. బాంచత్. ధూమ్ ధామ్ దోస్తాన్ .. ఇరగమరగా జేద్దాం
నాని - కీర్తి సురేష్ జంటగా.. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా "దసరా". రామగుండం బొగ్గు గనులకు సంబంధించిన పరిసరాల్లో నడిచే కథ ఇది. ఊరమాస్ లుక్ లో నాని పోస్టర్ విడుదలైనప్పటి నుంచే సినిమాపై హైప్ క్రియేట్ అయింది. తాజాగా ఈ సినిమా నుంచి ధూమ్ ధామ్ లిరికల్ సాంగ్ ని విడుదల చేసింది చిత్ర బృందం.
'ఇచ్చి పడేద్దాం .. గుచ్చి పడేద్దాం .. ఎవ్వడడ్డమొత్తడో చూద్దాం .. బాంచత్. ధూమ్ ధామ్ దోస్తాన్ .. ఇరగమరగా జేద్దాం' అంటూ ఈ పాట సాగుతోంది. సంతోష్ నారాయణ్ సంగీతాన్ని సమకూర్చిన ఈ పాటకి కాసర్ల శ్యామ్ సాహిత్యాన్ని అందించాడు. బొగ్గుగనుల్లో పనిచేసుకుంటూ.. తమ స్వభావం, జీవితాన్ని ఆవిష్కరిస్తూ పాడుకునే పాట ఇది. ఇప్పటి వరకూ నాని నటించిన సినిమాల్లో ఇది ఫుల్ లెంగ్త్ మాస్ సాంగ్ గా ఉండిపోతుంది. వచ్చే ఏడాది మార్చి 30న ఈ సినిమా విడుదల కాబోతోంది.
Next Story