Fri Jul 01 2022 23:42:53 GMT+0000 (Coordinated Universal Time)
ఆ దంపతులకు ఊహించని షాక్ ఇచ్చిన ధనుష్

తమిళ హీరో ధనుష్ తమ కొడుకేనని ఓ జంట గతంలో చేసిన రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమ వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని కోర్టుకెక్కడమే కాకుండా.. మీడియా ముందు కూడా చాలా ఆరోపణలు చేశారు. మధురైలోని మేలూరుకు చెందిన కదిరేశన్, మీనాక్షి దంపతులు ధనుష్ తమ మూడవ కుమారుడు అంటూ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. సినిమాలపై ఉన్న ఆసక్తితో చిన్నప్పుడే ధనుష్ ఇల్లు వదిలి చెన్నై వెళ్లిపోయాడని కదిరేశన్, మీనాక్షి దంపతులు తెలిపారు. లేజర్ ట్రీట్మెంట్ వలన శరీరంపై ఉన్న మచ్చలను చెరిపేయవచ్చని.. అలానే చేశాడు ధనుష్ అని చెప్పుకొచ్చారు. సొంత తల్లిదండ్రులకు నెలవారీ రూ. 65 వేలు పరిహారం చెల్లించాలని కోరారు. అయితే తనపై వచ్చిన ఆరోపణలను ఖండిస్తూ వస్తున్నాడు ధనుష్. తాను డైరెక్టర్ కస్తూరి రాజా కుమారుడినంటూ ధనుష్ గతంలో కోర్టుకు జనన ధృవీకరణ పత్రాలు సమర్పించారు.
తాజాగా తమకు క్షమాపణలు చెప్పాలని, లేకపోతే రూ.10 కోట్ల పరువు నష్టం కింద చెల్లించాల్సి వుంటుందని నటుడు ధనుష్ దంపతులకు కోర్టు నోటీసులు పంపారు. తమ గౌరవానికి ఇబ్బంది కలిగించేలా చేస్తున్న ఆరోపణలను ఆపాలని ఆయన కోరారు. ఈ ఆరోపణలపై ధనుష్, ఆయన తండ్రి కసూర్తిరాజా ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు చేస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవాలేనని.. ఇకనైనా వాటిని ఆపాలని అన్నారు. క్షమాపణలు చెబుతూ ఒక స్టేట్మెంట్ని విడుదల చేయాలని, లేకుంటే రూ. 10 కోట్ల పరువు నష్టం కేసును ఎదుర్కోవాల్సి వస్తుందని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు.ధనుష్.. తన తండ్రి కస్తూరి రాజాతో కలిసి కథిరేసన్కు లీగల్ నోటీసులు పంపాడు. 'ఇకపై వారిపై అబద్ధపు ఆరోపణలు చేయవద్దని నా క్లైంట్స్ కోరుతున్నారు.' అని నోటీసులో పేర్కొన్నారు ధనుష్ తరపున లాయర్. అంతే కాకుండా ఇకపై ఇలాంటివి ఆపకపోతే వారు కోర్టులో పరువునష్టం దావా కూడా వేస్తామని నోటిసులో తెలిపారు. అంతే కాకుండా రూ.10 కోట్ల జరిమానాకు కూడా వారు సిద్ధంగా ఉండాలని అన్నారు.
Next Story