అవకాశాలు తగ్గినందుకేనా
ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ కి ప్రస్తుతం సినిమాలు తగ్గాయి. కారణం అతను ఈమధ్య అన్ని సినిమాల్లో అవే ట్యూన్లు మార్చి మార్చి కొడుతున్నాడని కొత్తదనం [more]
ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ కి ప్రస్తుతం సినిమాలు తగ్గాయి. కారణం అతను ఈమధ్య అన్ని సినిమాల్లో అవే ట్యూన్లు మార్చి మార్చి కొడుతున్నాడని కొత్తదనం [more]

ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ కి ప్రస్తుతం సినిమాలు తగ్గాయి. కారణం అతను ఈమధ్య అన్ని సినిమాల్లో అవే ట్యూన్లు మార్చి మార్చి కొడుతున్నాడని కొత్తదనం ఏమి లేదని విమర్శలు వస్తున్నాయి. అందుకే ఆయనకు అవకాశాలు తగ్గుతున్నాయి టాక్ కూడా వచ్చింది.
సెలెక్టివ్ సినిమాలే …..
అటు దేవిశ్రీ ప్రసాద్ కూడా సెలెక్టివ్ సినిమాలే చేయాలనీ, చేసే కొద్దీ సినిమాలైనా మంచి ట్యూన్స్ ఇవ్వాలని బాగా గట్టిగా డిసైడ్ అయ్యాడట. ఈమధ్య మహేష్ కి బాగా క్లోజ్ అయిన దేవిశ్రీ ‘సరిలేరు నీకెవ్వరు’ చేయడానికి ఒప్పుకున్నాడు. మహేష్ కెరీర్ లోనే బెస్ట్ ఆల్బం ఇవ్వాలని కసిగా పని చేస్తున్నాడు దేవి. ఈ సినిమా చేస్తున్నప్పుడు మరేమి సినిమా చేయకూడదని…ఫోకస్ మొత్తం దీనిపైనే పెట్టాలని నిర్ణయించుకున్నాడట.
అదరగొట్టారట…
రీసెంట్ గా దేవిశ్రీ కొన్ని ట్యూన్స్ కంపోజ్ చేసి టీం కి వినిపించాడట. ట్యూన్స్ విన్న వారు అంత ఇరగదీస్తున్నాడని కితాబులు ఇస్తున్నారు. ఈ చిత్రంలో రెండు మాస్ సాంగ్స్ తో పాటు ఒక ఇంట్రడక్షన్ సాంగ్ కూడా ఇచ్చాడట దేవిశ్రీ. ఇవి పీక్స్‌లో ఉన్నాయని టాక్ వస్తుంది. అలానే మహేష్ బాబు బర్త్‌డేకి విడుదల చేసే ఫస్ట్‌లుక్‌లో దేవి మ్యూజిక్ బిట్ ఒకటి వినిపిస్తారట. ఈ ట్యూన్ విన్న తరువాత సినిమా పై అంచనాలు పెరిగిపోతాయి అని చెబుతున్నారు. ఇక ఈమూవీ వచ్చే సంక్రాంతి కి రిలీజ్ అవ్వనుంది.

