Sun Dec 08 2024 00:23:41 GMT+0000 (Coordinated Universal Time)
Bimbisara : బింబిసారా 2 దర్శకుడు అతడే.. వశిష్ఠ ఎందుకు తప్పుకున్నాడంటే..
బింబిసారా 2 డైరెక్ట్ చేయడానికి మరో దర్శకుడు భాద్యతలు తీసుకున్నాడు. ఇంతకీ వశిష్ఠ ఎందుకు తప్పుకున్నాడంటే..
Bimbisara : నందమూరి కళ్యాణ్ రామ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచిన సినిమా 'బింబిసారా'. కొత్త దర్శకుడు వశిష్ఠ తెరకెక్కించిన ఈ చిత్రం సోషియో ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ గా వచ్చి బ్లాక్ బస్టర్ అందుకుంది. టైం ట్రావెల్ ని ఒక కొత్త యాంగిల్ లో చూపించి ఆడియన్స్ ని థ్రిల్ చేశారు. ఈ సినిమా రిలీజ్ కాకముందే ఈ చిత్రానికి సీక్వెల్ ఉంటుందని కళ్యాణ్ రామ్ పేర్కొన్నారు. ఇక మూవీ సూపర్ హిట్ అవ్వడంతో.. సీక్వెల్ పై అంచనాలు పెరిగాయి.
ఆడియన్స్ కూడా సీక్వెల్ కోసం ఎదురు చూస్తున్నారు. దర్శకుడు వశిష్ఠ తన రెండు సినిమాగా బింబిసారా 2నే తెరకెక్కించబోతున్నట్లు చెప్పుకొచ్చారు. స్క్రిప్ట్ వర్క్ కూడా చేస్తున్నట్లు పేర్కొన్నారు. కానీ సడన్ గా ఈ ప్రాజెక్ట్ ని పక్కన పెట్టేసి చిరంజీవితో మూవీ మొదలు పెట్టారు. ప్రస్తుతం చిరంజీవితో మెగా156 తెరకెక్కిస్తున్నారు. దీంతో బింబిసారా 2 ఆగిపోయినట్లేనా అని ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
అయితే తాజాగా వీటికి కళ్యాణ్ రామ్ బదులిచ్చారు. ప్రస్తుతం 'డెవిల్' మూవీ ప్రమోషన్స్ లో ఉన్న కళ్యాణ్ రామ్.. బింబిసారా 2 కచ్చితంగా ఉంటుందని పేర్కొన్నారు. అయితే అది మొదటి భాగం తెరకెక్కించిన వశిష్ఠ తెరకెక్కించడం లేదని తెలియజేసారు. క్రియేటివ్ డిఫరెన్స్ రావడంతో వశిష్ఠ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు కళ్యాణ్ రామ్ వెల్లడించారు.
ఇక ఈ సీక్వెల్ దర్శకత్వ భాద్యతలు 'అనిల్ పాదూరి' తీసుకుంటున్నారట. ఈ దర్శకుడు గతంలో పూరిజగన్నాథ్ తనయుడు హీరోగా తెరకెక్కిన 'రొమాంటిక్' మూవీకి దర్శకత్వం వహించారు. అంతేకాదు బింబిసారా 1కి VFX డిజైనర్ గా వర్క్ చేశారు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ పట్టాలు ఎక్కబోతుంది.
Next Story