Sat Dec 07 2024 15:04:40 GMT+0000 (Coordinated Universal Time)
Deavara Story: ఆన్ లైన్ లో లీక్ అయిన 'దేవర' స్టోరీ.. ఆ పాట సినిమాలో ఉందట!
ఎన్టీఆర్-కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న దేవర పార్ట్ 1
ఎన్టీఆర్-కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న దేవర పార్ట్ 1 థియేట్రికల్ ట్రైలర్ భారీ హైప్‌ను క్రియేట్ చేసింది. అనిరుధ్ రవిచందర్ స్వరపరిచిన ఆడియో కారణంగా థియేటర్స్ లో అభిమానులకు పూనకాలే అని చెప్పొచ్చు. ఎన్టీఆర్ కు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న భారీ ఫాలోయింగ్ కారణంగా ఈ సినిమా భారీ ఓపెనింగ్స్ నమోదు చేయడం ఖాయం. అయితే ఈ సినిమా ట్రైలర్ చూశాక ఇదే స్టోరీ అంటూ పలువురు చెబుతూ వస్తున్నారు. అది కాస్తా ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది.
సెన్సార్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ దేవర: పార్ట్ వన్ కు ‘U/A’ సర్టిఫికేట్‌తో క్లియర్ చేసింది. మేకర్స్ విడుదలకు రెండు వారాల ముందే సెన్సార్ పనులను ముగించారు. సినిమా వ్యవధికి సంబంధించి అధికారిక ప్రకటన లేనప్పటికీ, దాదాపు 3 గంటల సుదీర్ఘ రన్ టైమ్ లాక్ చేశారని తెలుస్తోంది. ఈ చిత్రం సెకండాఫ్‌లో భారీగా యాక్షన్ ఎపిసోడ్స్ ఉండనున్నాయి. సినిమా చివరిలో ‘దావుది’ పాటను ప్లే చేస్తారు.
Next Story