Sat Dec 07 2024 20:58:28 GMT+0000 (Coordinated Universal Time)
Devara1: దేవర ట్రైలర్.. డబుల్ యాక్షన్ తో డబుల్ రచ్చ
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర పార్ట్ 1 ట్రైలర్
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర పార్ట్ 1 ట్రైలర్ విడుదలైంది. ఈ సినిమాలో డబుల్ యాక్షన్ లో ఎన్టీఆర్ కనిపించబోతున్నాడు. తండ్రీకొడుకులకు సంబంధించిన కథలో అన్ని మాస్ ఎలిమెంట్స్ ఉండబోతున్నాయి. కొరటాల శివ డైరెక్షన్లో భారీ బడ్జెట్‌తో ఈ చిత్రం తెరకెక్కింది. ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 27న విడుదల కానున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అంచనాలకు తగ్గట్టుగా ట్రైలర్ కూడా ఉంది. ఈ సినిమాలో ఎన్టీఆర్‌కు జోడీగా జాన్వీ కపూర్ నటిస్తుండగా సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటించారు. ప్రకాశ్‌రాజ్, శ్రీకాంత్ తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు.
ఆర్ఆర్ఆర్ సినిమాతో ఉత్తరాదిన కూడా మంచి పాపులారిటీని అందుకున్న ఎన్టీఆర్ 'దేవర 1' తో మరింత దగ్గరవ్వాలని అనుకుంటున్నారు. బాలీవుడ్ మూవీ వార్ కూడా ఎన్టీఆర్ చేస్తూ ఉండడంతో దేవర 1 మీద అక్కడ కూడా మంచి హైప్ ఉంది. దేవర: మొదటి భాగం ప్రమోషన్స్ లో భాగంగా తారక్, జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్‌లతో కలిసి కపిల్ శర్మ ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో’లో పాల్గొన్నారు. చిత్ర నిర్మాత కరణ్ జోహార్‌తో తారక్ ప్రత్యేక చిట్‌చాట్‌లో కూడా పాల్గొన్నాడు.
Next Story