Sat Dec 07 2024 17:02:42 GMT+0000 (Coordinated Universal Time)
Devara Trailer: దేవర ట్రైలర్ వచ్చేస్తోంది.. టైమ్ ఇదే
ఎన్టీఆర్-కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న దేవర సినిమా
ఎన్టీఆర్-కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న దేవర సినిమా సెప్టెంబర్ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమా ట్రైలర్ను నేడు ముంబైలో గ్రాండ్గా విడుదల చేయనున్నారు. ఈ ఈవెంట్ కోసం ఎన్టీఆర్, హీరోయిన్ జాన్వీ కపూర్ ముంబై చేరుకున్నారు. సాయంత్రం 5:04 గంటలకు ట్రైలర్ను లాంచ్ చేయనున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన పాటలు మంచి హైప్ ను సొంతం చేసుకున్నాయి. ట్రైలర్ కూడా అదిరిపోయేలా ఉంటుందని ఇప్పటికే మేకర్స్ చెబుతున్నారు. ముఖ్యంగా దేవర సినిమాను పాన్ ఇండియా రేంజిలో హిట్ చేయాలని చిత్ర యూనిట్ చూస్తోంది.
దేవర పార్ట్-1 ట్రైలర్ ఎలా ఉంటుందా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ సినిమాలో ఎన్టీఆర్ డబుల్ రోల్ చేస్తున్నాడా అనే అనుమానాలు అభిమానుల్లో ఉన్నాయి. ఆ విషయంలో ట్రైలర్ ద్వారా ఓ క్లారిటీ వచ్చేస్తుంది. ఇక ట్రైలర్ కిక్ ఇస్తే సినిమాకి భారీ ఓపెనింగ్ వస్తుందని అంచనా వేస్తున్నారు. అన్నీ కుదిరితే తొలిరోజునే దేవర 150 కోట్ల గ్రాస్ని టచ్ చేసే అవకాశం ఉంది. లాంగ్ రన్ లో సినిమా 800 కోట్లు కూడా టచ్ చేసే అవకాశం ఉందని అంటున్నారు.

Next Story