Sun Oct 13 2024 13:00:50 GMT+0000 (Coordinated Universal Time)
Devara Movie Tickets ఏపీ-తెలంగాణలో దేవర సినిమా టికెట్ల ధరలివే!!
దేవర సినిమాకి కూడా తెలుగు రాష్ట్రాల్లో టిక్కెట్ ధరల
దేవర: మొదటి భాగం కోసం సినీ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తూ ఉన్నారు. సెప్టెంబర్ 27 ఎప్పుడు వస్తుందా అన్నట్లు అభిమానులు సిద్ధమై ఉన్నారు. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రీ-సేల్స్‌తో భారీ కలెక్షన్స్ ను వసూలు చేసింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సెప్టెంబర్ 22న హైదరాబాద్‌లో జరగనుంది.
ఇతర పాన్-ఇండియన్ సినిమాల లాగా దేవర సినిమాకి కూడా తెలుగు రాష్ట్రాల్లో టిక్కెట్ ధరల పెంపుకు అనుమతి సంపాదించుకుంది. దేవర ఆంధ్రప్రదేశ్ టిక్కెట్ ధరలు చూస్తే సింగిల్ స్క్రీన్లకు 200 రూపాయలు, మల్టీప్లెక్స్‌లకు 325గా నిర్ణయించారు. తెలంగాణలో సింగిల్ స్క్రీన్లకు 250 రూపాయలు, మల్టీప్లెక్స్‌లలో 413 రూపాయలుగా నిర్ణయించారు.
ఎన్టీఆర్ నటించిన దేవర సెప్టెంబర్ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. అర్ధరాత్రి షోలకు ఏపీ ప్రభుత్వం ఆమోదం తెలుపుతుందని డిస్ట్రిబ్యూటర్లు ఎంతో నమ్మకంగా ఉన్నారు. దేవర అన్ని సెంటర్లలో అర్ధరాత్రి 1 AM నుండి షోలను ప్లాన్ చేసారు. డిస్ట్రిబ్యూటర్లు కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే 1 AM షో టిక్కెట్లను ఫ్యాన్సీ ధరలకు విక్రయించడం ప్రారంభించారు. అర్ధరాత్రి షోలు మొదలైతే ఈ సినిమా మొదటి వీకెండ్ లో భారీ కలెక్షన్స్ ను కొల్లగొడుతుంది.

Next Story