Fri Dec 05 2025 13:16:57 GMT+0000 (Coordinated Universal Time)
శ్రీరెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన దీప్తి సునయన..
దీప్తి - షన్నూల బ్రేకప్ తర్వాత.. వివాదాస్పద నటి అయిన శ్రీ రెడ్డి.. బిగ్ బాస్ తెలుగు సీజన్ 2 లో పాల్గొన్నప్పుడు

దీప్తి సునయన.. నెటిజన్లకు పరిచయం అక్కర్లేని పేరు. యూట్యూబ్, ఫేస్ బుక్, ఇన్ స్టా యూజర్లందరికీ దీప్తి సుపరిచితురాలే. తాజాగా షన్నూకి బ్రేకప్ చెప్పడంతో వార్తల్లో నిలిచింది దీప్తి. ఆ తర్వాత వారిద్దరి బ్రేకప్ గురించి నటి శ్రీరెడ్డి కౌంటరిచ్చింది. శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందించిన దీప్తి.. మరోమారు వార్తల్లోకెక్కింది.
దీప్తి - షన్నూల బ్రేకప్ తర్వాత.. వివాదాస్పద నటి అయిన శ్రీ రెడ్డి.. బిగ్ బాస్ తెలుగు సీజన్ 2 లో పాల్గొన్నప్పుడు తనీష్‌తో దీప్తి చేసింది ఏంటి? అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆమె చేసిన దాంట్లో తప్పు లేనప్పుడు షన్నూను ఎందుకు తప్పుపడుతోందని అర్థమొచ్చేలా కౌంటరిచ్చింది. శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలపై దీప్తి స్పందించింది. "నేను బిగ్ బాస్ తెలుగు 2లోకి ప్రవేశించినప్పుడు నాకు 20 ఏళ్లు. నేను షోలో పాల్గొన్నప్పుడు చిన్నదాన్ని. నిజంగా దాని గురించి లేదా అలాంటి సంబంధం గురించి నాకు ఎటువంటి క్లారిటీ లేదు. కానీ ఆ షో ద్వారా నేను చాలా నేర్చుకున్నాను" అని చెప్పుకొచ్చింది దీప్తి.
News Summary - Deepthi Sunaina Reacts on Sri Reddy Comments
Next Story

