Fri Dec 06 2024 05:37:30 GMT+0000 (Coordinated Universal Time)
Deepika Ranveer: పాపకు జన్మినిచ్చిన దీపిక పదుకోన్
దీపికా పదుకొణె, రణవీర్ సింగ్ జంట పట్టలేని ఆనందంతో
దీపికా పదుకొణె, రణవీర్ సింగ్ జంట పట్టలేని ఆనందంతో ఉంది. సెప్టెంబర్ 8న దీపికా పదుకోన్ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. సెప్టెంబర్ 7న సాయంత్రం 5 గంటల ప్రాంతంలో దీపిక ఆసుపత్రిలో చేరింది. నటిని ఆమె తల్లి ఉజ్జల పదుకోన్ ముంబైలోని రిలయన్స్ ఫౌండేషన్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. దీపిక శనివారం ఆసుపత్రికి వెళ్లినప్పుడు ఆమెకు సంబంధించిన అనేక ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
తమ మొదటి బిడ్డను స్వాగతించడానికి రెండు రోజుల ముందు.. దీపికా, రణవీర్ నగరంలోని సిద్ధివినాయక ఆలయాన్ని సందర్శించారు. తవినాయకుడి ఆశీర్వాదం కోరుతూ దంపతులు తమ కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లారు. ఈ జంట డిసెంబర్ 2018లో ఇటలీలోని లేక్ కోమోలో వివాహం చేసుకున్నారు. మొదట సౌత్ ఇండియన్ తరహాలో వివాహం చేసుకున్నారు.. ఆ తరువాత ఆనంద్ కరాజ్ వేడుక నిర్వహించారు. దీపిక సింగం ఎగైన్ సినిమా విడుదల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో దీపిక లేడీ సింగంగా పరిచయమవ్వనున్నారు. రణవీర్ అతిధి పాత్రలో ఈ సినిమాలో కనిపించనున్నాడు.
Next Story