Thu Mar 19 2026 01:18:10 GMT+0530 (India Standard Time)
లాస్ట్ కోరిక తీరకుండానే కృష్ణంరాజు
రెబల్ స్టార్ కృష్ణంరాజు మృతి టాలీవుడ్ నే కాకుండా రాజకీయ వర్గాల్లోనూ విషాదం నింపింది

రెబల్ స్టార్ కృష్ణంరాజు మృతి టాలీవుడ్ నే కాకుండా రాజకీయ వర్గాల్లోనూ విషాదం నింపింది. కొన్ని దశాబ్దాల పాటు చిత్రసీమను ఏలిన కృష్ణంరాజు చివరిగా ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ చిత్రంలో నటించారు. ఆ సినిమా హిట్ అవుతుందని భావించినా అనుకున్న స్థాయిలో సక్సెస్ కాకపోవడం కొంత ఆయన మనసుకు బాధ కలిగించింది. అయితే ఈ సినిమా విడుదల సమయంలో అనేక టీవీ ఛానెళ్లకు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు.
ప్రభాస్ పెళ్లి....
అయితే ఆయన తన చివరి కోరిక తీరకుండానే మరణించడం బాధాకరం. ప్రభాస్ త్వరగా పెళ్లి చేసుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ప్రభాస్ బిడ్డను ఎత్తుకుని తనకు ఆడించాలని ఉంది ఆయన చేేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రభాస్ పెళ్లిని దగ్గరుండి చేయాలని భావించిన కృష్ణంరాజు ఆ కోరిక తీరకుండానే మరణించారు. కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు అది తలచుకుని రోదిస్తున్నారు.
Next Story

