Fri Dec 05 2025 15:37:42 GMT+0000 (Coordinated Universal Time)
Prabhas : ప్రభాస్ మూవీపై అదిరిపోయే అప్ డేట్.. స్పిరిట్ మూవీ షూటింగ్ ప్రారంభం ఎప్పుడంటే?
క్షణం తీరిక లేకుండా.. షూటింగ్ లలో గ్యాప్ లేకుండా పనిచేసేది డార్లింగ్ ప్రభాస్ మాత్రమే. స్పిరిట్ మూవీపై తాజా అప్ డేట్ వచ్చేసింది

క్షణం తీరిక లేకుండా.. షూటింగ్ లలో గ్యాప్ లేకుండా పనిచేసేది డార్లింగ్ ప్రభాస్ మాత్రమే. మిగిలిన హీరోలు అలా ప్యామిలీలతో వెకేషన్ ట్రిప్ వేస్తుంటారు. కానీ ప్రభాస్ కు అది లేకపోవడంతో ఏకబిగిన షూటింగ్ ల మీద షూటింగ్ లు చేస్తుంటాడు. షూటింగ్ కు విరామ సమయంలో మంచి ఫుడ్ ను తిని ఎంజాయ్ చేస్తాడు. అంతే తప్ప మరొక పనిలేదు. ధ్యాస లేదు. ప్రభాస్ మూవీ ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉంది. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ రాజాసాబ్ మూవీ సినిమాను దాదాపుగా పూర్తి చేశాడు.
ఇద్దరు హేమాహేమీలు కావడంతో....
ఇక ఫౌజీ చిత్రం కూడా చిత్రీకరణలో ఉంది. అయితే అందరూ ప్రభాస్, సందీప్ వంగా దర్శకత్వంలో రూపుదిద్దుకునే స్పిరిట్ పైనే అందరి కళ్లు ఆసక్తితో ఎదురు చూస్తున్నాయి. ఇటు ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ కావడంతో పాటు సందీప్ వంగా కూడా పాన్ ఇండియా దర్శకుడు కావడంతో సహజంగానే స్పిరిట్ పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. అయితే స్పిరిట్ షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందన్న దానిపై ఇప్పటి వరకూ ఎలాంటి అధికారిక సమాచారం రాకపోవడంతో డార్లింగ్ ఫ్యాన్స్ ఒకింత డీలా పడిపోయారు.
సెప్టంబరు నుంచి...
భారీ స్థాయిలో తెరకెక్కనున్న స్పిరిట్ మూవీ పై లేటెస్ట్ అప్ డేట్ వచ్చింది. ఇటీవల విజయ్ దేవరకొండ సందీప్ వంగాతో ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా స్పిరిట్ సినిమా ఎప్పుడు మొదలవుతుందన్న దానిపైనే ఎక్కువగా ప్రశ్నలు వేశాడు. త్వరలోనే అని ఆయన సమాధానమిచ్చాడు. ఈ స్పిరిట్ సినిమాను భూషణ్ కుమార్ నిర్మిస్తున్నారు.ఇక అధికారికంగా అందుతున్న సమాచారం మేరకు స్పిరిట్ మూవీ రెగ్యులర్ చిత్రీకరణను సెప్టెంబరు నెల నుంచి మొదలు కాబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇందులో ప్రభాస్ పోలీసు అధికారి పాత్రలో కనిపించనున్నారు. సెప్టంబరు నెలలో షూటింగ్ ప్రారంభం అవుతుందని తెలియడంతో డార్లింగ్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
Next Story

