Mon Dec 29 2025 04:21:41 GMT+0000 (Coordinated Universal Time)
ఫిలింఛాంబర్ అధ్యక్షుడిగా సురేష్ బాబు
తెలుగు ఫిలిం ఛాంబర్ నూతన అధ్యక్షుడిగా దగ్గుబాటి సురేష్ బాబు ఎన్నికయ్యారు.

తెలుగు ఫిలిం ఛాంబర్ నూతన అధ్యక్షుడిగా దగ్గుబాటి సురేష్ బాబు ఎన్నికయ్యారు. ఫిలిం ఛాంబర్ కార్యదర్శిగా అశోక్ కుమార్, ఫిలిం ఛాంబర్ వైస్ ప్రెసిడెంట్ గా నాగవంశీ, కోశాధికారిగా ముత్యాల రామదాసులు ఎన్నికయ్యారు. ఎక్కువగా ప్రోగ్రెసివ్ ప్యానెల్ విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో చిన్న నిర్మాతలు కూడా పోటీ చేసినప్పటికీ ఎక్కువ సంఖ్యలో గెలవలేదు.
ప్రొగ్రెసివ్ ప్యానెల్ కే...
ఫిలిం ఛాంబర్ ఎన్నికల్లో తన బలాన్ని ప్రోగ్రెసివ్ ప్యానెల్ నిరూపించుకుంది. రన్నింగ్ ప్రొడ్యూసర్స్ అంతా కలిసి ప్రోగ్రెసివ్ ప్యానెల్ పేరుతో పోటీ చేయగా, ప్రోగ్రెసివ్ ప్యానెల్ మద్దతుతో అధ్యక్షుడిగా దగ్గుబాటి సురేష్ బాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యార. 48 మంది కార్యవర్గానికి ప్రోగ్రెసివ్ ప్యానెల్ లో 31, మన ప్యానెల్ లో 17 మంది గెలిచారు. గెలిచిన వారు చిత్ర పరిశ్రమ సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు.
Next Story

