Fri Mar 20 2026 07:35:11 GMT+0530 (India Standard Time)
వహీదా రహమాన్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు
వహీదా రహమాన్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

వహీదా రహమాన్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఐదు దశాబ్దాల పాటు వహీదారహమాన్ నటిగా ప్రేక్షకులను అలరించారు. 1972లో పద్మశ్రీ, 2011 పద్మభూషణ్ అవార్డులు దక్కాయి. ఆమె ఎన్నో అవార్డులు, రివార్డులను సొంతం చేసుకున్నారు. నాడు చిత్రసీమను వహీదా రహమాన్ ఏలారనే చెప్పాలి.
తెలుగు సినిమాతో...
తెలుగు సినిమాతో వెండితెరకు పరిచయం అయిన వహీదా రహమాన్ కు ఈ ప్రతిష్టాత్మకమైన అవార్డు లభించడం పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సినీ రంగంలో అత్యున్నత పురస్కారమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ప్రకటించడంతో ఆమె అభిమానులు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. పలువురు తమ సంతోషాన్ని సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు.
Next Story

