Sun Feb 01 2026 18:52:58 GMT+0000 (Coordinated Universal Time)
హీరో సిద్ధార్థ్ పై కేసు నమోదు
హీరో సిద్దార్థపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు.

హీరో సిద్దార్థపై హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేశారు. ట్విట్టర్ లో అసభ్యకరమైన పోస్టులు పెట్టారంటూ అందిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఒక మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో హీరో సిద్దార్థ్ పై కేసు నమోదయింది.
క్షమాపణలు చెప్పినా....
హీరో సిద్దార్థ్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ పై ఇటీవల సోషల్ మీడియాలో కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై సిద్ధార్థ్ బహిరంగంగా క్షమాపణలు కూడా చెప్పారు. అయితే సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో సైబర్ యాక్ట్ సెక్షన్ 67, ఐపీసీ 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
Next Story

