Tue Mar 17 2026 19:20:25 GMT+0530 (India Standard Time)
రేణుదేశాయ్ పై ట్రోల్స్... ఇద్దరి అరెస్ట్
రేణుదేశాయ్ ను సామాజిక మాధ్యమాల వేదికగా ట్రోల్ చేస్తున్న వారిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు.

రేణుదేశాయ్ ను సామాజిక మాధ్యమాల వేదికగా ట్రోల్ చేస్తున్న వారిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. మొత్తం నాలుగు అకౌంట్ల ద్వారా తనపై ట్రోల్ చేస్తున్నారని రేణుదేశాయ్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ కేసును నమోదు చేసుకుని విచారించిన సైబర్ క్రైమ్ పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు.
సెలబ్రిటీలను లక్ష్యంగా చేసుకుని...
గత కొంతకాలంగా సెలబ్రిటీలను లక్ష్యంగా చేసుకుని అసభ్యకర పదజాలంతోనూ, అబద్ధపు ప్రచారాలతో సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. ఇటీవల యాంకర్ అనసూయపై ఇలా పోస్టులు పెట్టిన వారిని కూడా అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా రేణుదేశాయ్ ఇచ్చిన ఫిర్యాదుతో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
Next Story

