Fri Dec 05 2025 09:05:22 GMT+0000 (Coordinated Universal Time)
హరిహర వీరమల్లు వెంట వివాదాలు
‘హరిహర వీరమల్లు’ సినిమాను వివాదాలు వెంటాడుతూ ఉన్నాయి.

‘హరిహర వీరమల్లు’ సినిమాను వివాదాలు వెంటాడుతూ ఉన్నాయి. ఈ సినిమాలో తెలంగాణ ప్రాంత యోధుడు పండుగ సాయన్న జీవిత చరిత్రను వక్రీకరిస్తున్నారని, ఇది చారిత్రక వాస్తవాలను తప్పుదోవ పట్టించడమేనని ఆరోపిస్తున్నారు. అవసరమైతే పవన్ కల్యాణ్ పైనే న్యాయపరంగా కేసు పెడతామని పండుగ సాయన్న జీవిత చరిత్ర రచయిత బెక్కెం జనార్దన్ హెచ్చరించారు. ‘హరిహర వీరమల్లు’ చిత్ర బృందం వాస్తవాలను పక్కన పెట్టి, సాయన్న చరిత్రను పూర్తిగా వక్రీకరించే ప్రయత్నం చేస్తోందని ఆయన ఆరోపించారు. పండుగ సాయన్న జీవిత చరిత్రపై సర్వ హక్కులు తనకే ఉన్నాయని, వాటిని ఉల్లంఘిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. సినిమాలో పండుగ సాయన్న చరిత్రకు సంబంధించిన తప్పుడు సన్నివేశాలను వెంటనే తొలగించాలని, లేనిపక్షంలో సినిమా విడుదలను అడ్డుకుంటామన్నారు.
Next Story

