Mon Oct 14 2024 04:53:58 GMT+0000 (Coordinated Universal Time)
వర్మ వైరాగ్యం విన్నారా.. ఇక ఆ సినిమాలు తీయడట
వివాదాస్పద దర్శకుడు రామ్గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు
వివాదాస్పద దర్శకుడు రామ్గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇకపై తాను రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పారు. రాజకీయ అంశాలతో తాను సినిమాలు తీయనని చెప్పారు. ఇకపై రాజకీయాల జోలికి వెళ్లనన్న రామ్గోపాల్ వర్మ ఆ కధాంశంతో సినిమాలు తీయనని ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తెలిపారు.
దేవుడి సినిమాలే...
తాను రాజకీయాల అంశంగా సినిమాలు మాత్రం తీయనని, ఇకపై దేవుళ్లపై సినిమాలు తీస్తానని రామ్గోపాల్ వర్మ తెలిపారు. ఇది విన్న వారు ఒకింత ఆశ్చర్యపోవడమే కాకుండా నవ్వుకున్నారు. వర్మలో ఈ వైరాగ్యానికి కారణం ఆంధ్రప్రదేశ్ లో తాను అభిమానించే జగన్ ప్రభుత్వం అధికారంలోకి రాకపోవడమే కారణమని సోషల్ మీడియాలో నెటిజన్లు పోస్టింగ్ లు పెడుతున్నారు.
Next Story