Thu Jan 29 2026 04:12:06 GMT+0000 (Coordinated Universal Time)
ప్రముఖ కమెడియన్ కు హార్ట్ అటాక్
రాజు పల్స్ తిరిగి వచ్చిందని PRO అజిత్ మీడియాకు తెలిపారు.

ప్రముఖ హాస్యనటుడు రాజు శ్రీవాస్తవ ఆసుపత్రి పాలయ్యారు. న్యూఢిల్లీలోని ఓ హోటల్లో జిమ్లో వ్యాయామం చేస్తుండగా గుండెపోటుకు గురయ్యారు. ఛాతీలో నొప్పి రావడంతో ఒక్కసారిగా రాజు ట్రెడ్మిల్ నుండి పడిపోయారు. అక్కడే ఉన్న వారు వెంటనే ఆయన్ని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. రాజు తన స్నేహితులను కలవడానికి ఒక వారం రోజులుగా ఢిల్లీలో ఉన్నారు. ఆయన కొంతమంది రాజకీయ ప్రముఖులను కూడా కలవబోతున్నారు. రాజు తన రెగ్యులర్ వర్కవుట్ రొటీన్ చేస్తూ వచ్చారు. ట్రెడ్మిల్పై నడుస్తున్నప్పుడు రాజుకు అకస్మాత్తుగా ఛాతీ నొప్పి వచ్చింది. వెంటనే ట్రెడ్ మిల్ నుండి పడిపోయారు. వెంటనే ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు.
రాజు పల్స్ తిరిగి వచ్చిందని PRO అజిత్ మీడియాకు తెలిపారు. ఆయన చికిత్సకు సానుకూలంగా స్పందిస్తున్నారు. ఆయన ఆరోగ్యం బాగుందని, అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించారు. కోలుకుంటున్నారని.. వీలైనంత త్వరగా తిరిగి మన ముందుకు రావాలని ప్రార్థించమని అభ్యర్థించారు. స్టాండ్-అప్ కమెడియన్ సునీల్ పాల్ రాజు ఆరోగ్యంపై ఒక అప్డేట్ ను పంచుకున్నారు. ఆయన క్షేమంగా ఉన్నారని పోస్ట్ చేసారు. రాజు శ్రీవాస్తవ 80వ దశకం నుండి చిత్ర పరిశ్రమలో ఉన్నారు. మైనే ప్యార్ కియా, బాజీగర్, జర్నీ బాంబే టు గోవా, బిగ్ బ్రదర్.. ఇలా చాలా చిత్రాలలో నటించారు. సునీల్ పాల్, ఇతర హాస్యనటులతో కలిసి ది గ్రేట్ ఇండియన్ లాఫ్టర్ ఛాలెంజ్లో పాల్గొన్నారు.
News Summary - Comedian Raju Srivastava suffers heart attack
Next Story

