Fri Dec 19 2025 02:39:30 GMT+0000 (Coordinated Universal Time)
ఘనంగా అలీ కూతురి వివాహం.. తరలివచ్చిన టాలీవుడ్
మెగాస్టార్ చిరంజీవి-సురేఖ, నాగార్జున-అమల దంపతులు, ఏపీ ప్రభుత్వం తరపున వచ్చిన మంత్రి రోజా నూతన వధూవరులను..

ప్రముఖ సినీ హాస్యనటుడు అలీ పెద్ద కుమార్తె ఫాతిమా వివాహం ఆదివారం రాత్రి ఘనంగా జరిగింది. హైదరాబాద్ లోని ఓ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన ఈ వివాహ వేడుకకు టాలీవుడ్ సెలబ్రిటీలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. మెగాస్టార్ చిరంజీవి-సురేఖ, నాగార్జున-అమల దంపతులు, ఏపీ ప్రభుత్వం తరపున వచ్చిన మంత్రి రోజా నూతన వధూవరులను ఆశీర్వదించారు. నాగార్జున-అమల దంపతులు ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్రస్తుతం ఫాతిమా వివాహ వేడుకకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
పెళ్లిపనులకు సంబంధించిన వీడియోలను అలీ భార్య ఎప్పటికప్పుడు తన యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేసేది. ఇక ఇటీవలే అలీకి ఏపీ ముఖ్యమంత్రి జగన్ పదవిని కట్టబెట్టారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడిగా నియమించారు. 1979లో బాలనటుడిగా వెండితెరకు పరిచయమైన అలీ.. ఇప్పటివరకూ 1000కి పైగా సినిమాల్లో నటించారు. ఎన్నో అవార్డులు అందుకున్నారు.
Next Story

