Wed Jul 09 2025 18:22:01 GMT+0000 (Coordinated Universal Time)
Akhanda : అఖండ రిలీజ్ డేట్ పై క్లారిటీ.. ఇక బాలయ్యకు ఈ ఏడాది మరో హిట్ రెడీ
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటే ఇక చెప్పాల్సిన పనిలేదు.

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటే ఇక చెప్పాల్సిన పనిలేదు. ఈ కాంబో ఒక రేంజ్ లో హిట్ మూవీలను అందిస్తుంది. కథతో పాటు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో ఇప్పటికే వచ్చిన అనేక సినిమాలు బాక్సాఫీసు వద్ద సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. అరవై పదుల వయసు దాటినా బాలయ్య లో ఏమాత్రం ఎనర్జీ లెవెల్స్ తగ్గలేదనడానికి ఈ సినిమాలు చూసిన వారు ఎవరైనా అంగీకరించాల్సిందే. బాలయ్య ఇప్పటికీ నిర్విరామంగా షూటింగ్ లలో పాల్గొంటూ యువ హీరోలకు పోటీ పడుతున్నాడనడంలో ఎలాంటి సందేహం లేదు.
సూపర్ డూపర్ హిట్ అయి...
కానీ నందమూరి బాలకృష్ణ నటించిన బోయపాటి శ్రీను డైరెక్షన్ లో వచ్చిన అఖండ మూవీ సూపర్ హిట్ అయింది. దానికి సీక్వెల్ గానే అఖండ 2ను బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్నారు. ఎప్పుడో ఈ మూవీకి సంబంధించిన పనులు ప్రారంభమయ్యాయి. ప్రయాగ్ రాజ్ లో జరిగిన కుంభమేళాలో కూడా బోయపాటి కొన్ని సీన్లు తన కెమెరాలో బంధించారు. దీంతో అఖండ 2 మూవీకి అప్పుడే హైప్ క్రియేట్ అయింది. గతంలో ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన సింహ, లెజెండ్ వంటి సినిమాలతో పాటు అఖండ సినిమాను మించి అఖండ 2 వస్తుందని చెబుతున్నారు.
ఆ తేదీన విడుదల...
అయితే ఈ మూవీకి సంబంధించి గతంలోనే మేకర్స్ ప్రకటన జారీ చేశారు. సప్టెంబరు 25వ తేదీన అఖండ 2 మూవీని విడుదల చేస్తామని ప్రకటించారు. అయితే షూటింగ్, పోస్టు ప్రొడక్షన్ పనుల్లో ఆలస్యంగా కారణంగా ఈ రిలీజ్ డేట్ వాయిదా వేస్తున్నట్లు సోషల్ మీడియాలో పెద్దయెత్తున వార్తలు వచ్చాయి. కానీ బోయపాటి శ్రీను అఖండ 2 సినిమాపై లేటెస్ట్ అప్ డేట్ ఇచ్చారు. సెప్టంబరు 25వ తేదీన మూవీ రిలీజ్ అవుతుందని బో్యపాటి అనౌన్స్ చేశారు. దసరాకు బాలయ్య సిల్వర్ స్క్రీన్ పై సందడి చేస్తారని ఆయన చెప్పడంతో నందమూరి ఫ్యాన్స్ కు తీపికబురు అందించారు.
Next Story