Thu Mar 19 2026 08:51:15 GMT+0530 (India Standard Time)
Jayaprada : నటి జయప్రద మిస్సింగ్.. పోలీసులు గాలింపు..
సినీ నటి జయప్రద కనిపించడం లేదు. ఆమె కోసం ఉత్తరప్రదేశ్ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అసలు విషయం ఏంటంటే..

Jayaprada : సినీ నటి, రాజకీయ నాయకురాలు జయప్రద కనిపించడం లేదు. ఆమె కోసం ఉత్తరప్రదేశ్ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అసలు విషయం ఏంటంటే, 2019 ఉత్తరప్రదేశ్ ఎన్నికల సమయంలో జయప్రద.. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లఘించారని ఆమె పై రెండు కేసులు నమోదు అయ్యాయి. ఆ కేసులో ఆమె కోర్టులో విచారణ ఎదుర్కొంటున్నారు.
అయితే ఆమె ఇప్పటివరకు విచారణకు హాజరుకాలేదు. న్యాయమూర్తి ఆమెను కోర్టుకి రావాలంటూ ఎన్నిసార్లు ఆదేశించినా ఆమె లెక్క చేయలేదు. దింతో ఆమె పై నాన్ బెయిలబుల్ వారెంట్ అరెస్ట్ జారీ చేసింది న్యాయస్థానం. ఇక ఈ కారణంతో జయప్రద.. ఎవరికి అందుబాటులో లేకుండా ఎక్కడో దాకున్నట్లు తెలుస్తుంది.
న్యాయస్థానం పోలీసులకు.. జయప్రదని జనవరి 10లోపు కోర్టు ముందు హాజరుపరచాలని ఆదేశించింది. దీంతో రామ్‌పూర్ ఎస్పీ ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాగా జయప్రద 2019 లో ఎన్నికల కోడ్ ఉన్న సమయంలో ఏప్రిల్ 19న ఆ నియమావళికి విరుద్ధంగా యూపీ స్వర్ మున్సిపల్ లోని నూర్పూర్ గ్రామంలో రోడ్డుని ప్రారంభించారు. అలాగే పిప్లియా మిశ్రా విలేజ్ లోని బహిరంగ సభలో పాల్గొని అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు.
Next Story

