Mon Feb 02 2026 07:40:45 GMT+0000 (Coordinated Universal Time)
ఇంకా ఐసీయూలోనే సిరివెన్నెల
సినీ పాటల రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి ఇంకా ఐసీయూలోనే చికిత్స పొందుతున్నారు

సినీ పాటల రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి ఇంకా ఐసీయూలోనే చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం కిమ్స్ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. ఐదు రోజుల క్రితం అనారోగ్యంతో సిరివెన్నెల సీతారామశాస్త్రి కిమ్స్ ఆసుపత్రిలో చేరారు. కొద్దిసేపటి క్రితం ఆసుపత్రి వైద్యులు ఆయన హెల్త్ బులిటెన్ విడుదల చేశారు.
త్వరగా కోలుకోవాలని....
సిరివెన్నెల సీతారామశాస్త్రి న్యూమోనియాతో బాధపడుతున్నారని కిమ్స్ వైద్యులు తెలిపారు. ఆరోగ్య పరిస్థిితి కొంత మెరుగుపడుతున్నా ఆయనకు ఇంకా ఐసీయూలోనే ఉంచి వైద్యం అందించాలని డాక్టర్లు తెలిపారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.
Next Story

