Sun Sep 15 2024 00:18:09 GMT+0000 (Coordinated Universal Time)
జూనియర్ ఎన్టీఆర్ మంచి మనసు
సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ తెలుగు రాష్ట్రాలకు భారీ విరాళాన్ని ప్రకటించారు. కోటి రూపాయల విరాళాన్ని ఆయన ప్రకటించారు
సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ తెలుగు రాష్ట్రాలకు భారీ విరాళాన్ని ప్రకటించారు. కోటి రూపాయల విరాళాన్ని ఆయన ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ కు యాభై లక్షలు, తెలంగాణకు యాభై లక్షల రూపాయల విరాళం ఇస్తున్నట్లు ఎక్స్ లో జూనియర్ ఎన్టీఆర్ తెలిపారు. గత కొద్ది రోజులుగా రెండు రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాలకు రెండు రాష్ట్రాలు దెబ్బతిన్నాయని అన్నారు.
వరద బీభత్సం చూసి...
వరద బీభత్సం చూసి తన మనసు చలించిందని జూనియర్ ఎన్టీఆర్ అన్నారు. తన వంతు సాయంగా బాధితులను ఆదుకునేందుకు, సహాయ కార్యక్రమాలు చేపట్టేందుకు ఈ సాయం ఉపయోగపడుతుందని భావిస్తున్నానని తెలిపారు. వరద దృశ్యాలను చూసి తన మనసు కుదురుగా లేదని జూనియర్ ఎన్టీఆర్ అన్నారు.
Next Story