Sun Dec 28 2025 16:56:33 GMT+0000 (Coordinated Universal Time)
నటుడు వైజాగ్ ప్రసాద్ కన్నుమూత!!

ప్రముఖ సినీ నటుడు వైజాగ్ ప్రసాద్ ఈ రోజు తెల్లవారు జామున 3 గంటలకు గుండెపోటుతో కన్నుమూసారు. ఆయన వయసు 75 సంవత్సరాలు. అనేక తెలుగు సినిమా మరియు టీవీ సీరియల్స్ లో ఆయన నటించారు. గత రెండేళ్లుగా అనారోగ్య సమస్యలు వల్ల ఇంటికే పరిమితం అయ్యారు.
వైజాగ్ ప్రసాద్
పూర్తిపేరు: కొర్లాం పార్వతీ వరప్రసాదరావు
ఊరు: విశాఖపట్నంలోని గోపాలపట్నం
ఆయనకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. 1983లో బాబాయ్ అబ్బాయ్ సినిమాతో నటుడిగా అరంగేట్రం చేశారు. గౌరి, నీరాజనం, జెమిని, అల్లరి బుల్లోడు, నువ్వు నేను, సుందరకాండ, రాణీ గారి బంగ్లా వంటి పలు చిత్రాలలో ఆయన నటించారు. సోమాజీగూడ యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందారు.
Next Story
