Sun Dec 08 2024 02:27:32 GMT+0000 (Coordinated Universal Time)
Ravi Teja : ఆసుపత్రిలో సినీనటుడు రవితేజ
సినీనటుడు రవితేజ ఆసుపత్రిలో చేరారు. హైదరాబాద్ లోని ఒక ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు
సినీనటుడు రవితేజ ఆసుపత్రిలో చేరారు. హైదరాబాద్ లోని ఒక ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఒక సినిమా షూటింగ్ సందర్భంగా రవితేజకు గాయమయింది. దీంతో ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆయన కుడిచేతికి గాయం కావడంతో సర్జరీ జరిగిందని చెబుతున్నారు. అయితే రవితేజకు తగిన గాయం స్వల్పమేనని వైద్యులు చెబుతున్నారు.
షూటింగ్ లో గాయపడి...
షూటింగ్ లో గాయపడినా రవితేజ షూటింగ్ లో పాల్గొనడంతో అది మరింత తీవ్రమయిందని వైద్యులు తెలిపారు. శస్త్ర చికిత్స చేసిన వైద్యులు రవితేజను ఆరు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. రవితేజ అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రవితేజ సన్నిహితులు తెలిపారు.
Next Story