Sat Jan 31 2026 17:56:56 GMT+0000 (Coordinated Universal Time)
మంచులక్ష్మికి చేదు అనుభవం
విమానాశ్రయంలో మోహన్ బాబు కుమార్తె మంచులక్ష్మికి చేదు అనుభవం ఎదురయింది

విమానాశ్రయంలో మోహన్ బాబు కుమార్తె మంచులక్ష్మికి చేదు అనుభవం ఎదురయింది. ఇండిగో విమానంలో మంచు లక్ష్మి తన బ్యాగును మరిచిపోయారు. బ్యాగ్ కోసం నలభై నిమిషాలు బయట కూర్చోవాల్సి వచ్చిందని ఆమె ట్వీట్ చేశారు. తాను 103 డిగ్రీల జ్వరంతో బాధపడుతున్నానని, ఎవరైనా సిబ్బంది తనకు సహాయం చేస్తారా? అని ట్వీట్ చేశారు. ఇండిగో సిబ్బంది పట్టించుకోకపోవడంపై ఆమె నిరసన వ్యక్తం చేశారు.
ఫ్లైట్ లో బ్యాగ్‌ను...
తిరుపతి నుంచి బయలుదేరి హైదరాబాద్ విమానాశ్రయాన్ని చేరుకున్న అనంతరం తన బ్యాగ్ ను తీసుకునేందుకు గేటు బయట నలభై నిమిషాలు వెయిట్ చేయాల్సి వచ్చిందన్నారు. ఈ విషయం ఇండిగో సిబ్బందికి తెలియజేసినా ఎవరూ పట్టించుకోలేదన్నారు. ఇది ఖచ్చితంగా సిబ్బంది నిర్లక్ష్యమేనని ఆమె చెప్పారు. తిరుపతి నుంచి హైదరాబాద్ రావడానికి కూడా ఇంత సమయం పట్టలేదని మంచు లక్ష్మి అన్నారు.
Next Story

