Fri Mar 20 2026 08:11:02 GMT+0530 (India Standard Time)
నేను బతికే ఉన్నా : కోట శ్రీనివాసరావు
ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు చనిపోయినట్లు సోషల్ మీడియాలో వార్త వైరల్ కావడంతో ఆయన కుటుంబ సభ్యులు కూడా అవాక్కయ్యారు

సోషల్ మీడియాలో పోస్టులు ఎవరికి తోచిన రీతిలో వారు పెడుతున్నారు. కనీసం మర్యాద, జ్ఞానం లేకుండా పోస్టులు చేయడం కొందరికి అలవాటుగా మారింది. ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు చనిపోయినట్లు సోషల్ మీడియాలో వార్త వైరల్ కావడంతో ఆయన కుటుంబ సభ్యులు కూడా అవాక్కయ్యారు.
వీడియో విడుదల...
దీంతో స్వయంగా కోట శ్రీనివాసరావు వీడియోను విడుదల చేశారు. తాను బతికే ఉన్నానని, అబద్ధపు ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దని ఆయన కోరుకున్నారు పాపం. ఉదయం నుంచి తనకు ఆ పోస్టులు చూసి యాభైకి పైగా ఫోన్లు వచ్చాయని, చివరకు పోలీసులు కూడా బందోబస్తుకు వచ్చారని ఆయన వీడియోలో వివరించారు. సోషల్ మీడియాలో ఇలాంటి దరిద్రపు పోస్టులు ఎవరూ నమ్మవద్దని, తాను క్షేమంగానే ఉన్నానని కోట శ్రీనివాసరావు తెలిపారు.
Next Story

