టాలీవుడ్ మొత్తం హీరోల చుట్టూనే తిరుగుతుందా?
టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోల డామినేషన్ ఎక్కువైందా? అంటే అవుననే అంటున్నాడు ప్రముఖ సినిమాటోగ్రాఫర్ చోట కె నాయుడు. అలీ తో జాలిగా ప్రోగ్రాం కి వచ్చిన చోట [more]
టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోల డామినేషన్ ఎక్కువైందా? అంటే అవుననే అంటున్నాడు ప్రముఖ సినిమాటోగ్రాఫర్ చోట కె నాయుడు. అలీ తో జాలిగా ప్రోగ్రాం కి వచ్చిన చోట [more]

టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోల డామినేషన్ ఎక్కువైందా? అంటే అవుననే అంటున్నాడు ప్రముఖ సినిమాటోగ్రాఫర్ చోట కె నాయుడు. అలీ తో జాలిగా ప్రోగ్రాం కి వచ్చిన చోట కె నాయుడు తన పర్సనల్ విషయాలతో పాటుగా… టాలీవుడ్ హీరో లపై సంచలన కామెంట్స్ చేసాడు. అలీ తో జాలిగా.. ప్రోమో లో చోటా హీరోలపై చేసిన ఈ కామెంట్స్ హాట్ హాట్ గా ఇండస్ట్రీలో చర్చకు దారి తీసింది. ప్రస్తుతం తెలుగు లో సినిమాటోగ్రఫేర్స్ ఖాళీగా వున్నారని చెబుతున్నాడు. అలీ… కొత్త సినిమాటోగ్రఫేర్స్ కి అవకాశాలివ్వాల్సి వచ్చి మీరెప్పుడైనా తప్పుకున్నారా అని చోటని అడగ్గానే అసలు టాలీవుడ్ సినిమా కెమెరా మేన్స్ కి పనే లేదని, టాలీవుడ్ హీరోలు ఎలా చెబితే అలానే ఇండస్ట్రీ నడుస్తుంది అంటూ సంచలన కామెంట్స్ చేసాడు.
టాలీవుడ్ హీరోల మ్యానియాలో తెలుగు సినిమా ఇండస్ట్రీ ఉందని, హీరోల డామినేషన్ ఎక్కువైంది అంటూ సంచలనంగా మాట్లాడాడు చోటా కె నాయుడు. గతంలో హీరోయిన్స్ కి ముద్దు పెట్టాడని చోట కె నాయుడు మీద ట్రోలింగ్ నడిచింది. ఇక తాజాగా హీరోల మీద చోటా చేసిన ఈ వ్యాఖ్యల దుమారం ఎక్కడివరకు వెళ్లి ఆగుతుందో చూడాలి. అలాగే అలీ తో జాలిగా చోటా కె ప్రోగ్రాం ఫుల్ ఎపిసోడ్ ఈ సోమవారం ఈటీవీలో ప్రసారం కానుంది. మరి ప్రోమోతోనే కాక రేపిన ఈ అలీ తో జాలి ప్రోగ్రాం…. ఫుల్ ఎపిసోడ్ తో మరెంత కాక రేపుతుందో చూడాలి.

