చిరు వీడియో వైరల్!
లేట్ గా వచ్చిన లేటెస్ట్ గా వచ్చా అంటున్న మెగాస్టార్ చిరంజీవి. తన తోటి హీరోలు అందరు సోషల్ మీడియాలో ఎప్పటినుండో యాక్టీవ్ గా ఉంటె చిరు [more]
లేట్ గా వచ్చిన లేటెస్ట్ గా వచ్చా అంటున్న మెగాస్టార్ చిరంజీవి. తన తోటి హీరోలు అందరు సోషల్ మీడియాలో ఎప్పటినుండో యాక్టీవ్ గా ఉంటె చిరు [more]
లేట్ గా వచ్చిన లేటెస్ట్ గా వచ్చా అంటున్న మెగాస్టార్ చిరంజీవి. తన తోటి హీరోలు అందరు సోషల్ మీడియాలో ఎప్పటినుండో యాక్టీవ్ గా ఉంటె చిరు మాత్రం చాలా లేట్ ఎంట్రీ ఇచ్చారు సోషల్ మీడియాకు. ఉగాది సందర్భంగా చిరు ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. వచ్చిన దగ్గరనుండి చిరు సోషల్ మీడియా లో చాలా యాక్టీవ్ గా ఉంటున్నారు. తనకు సంబంధించి ఏ విషయం అయినా తన అకౌంట్స్ లో షేర్ చేస్తున్నారు. తన పర్సనల్ విషయాలే కాదు సమాజంలో జరిగే సంఘటనలను కూడా ట్విట్టర్లో షేర్ చేస్తున్నారు.
రీసెంట్ గా చిరు షేర్ చేసిన ఓ వీడియో బాగా వైరల్ అయింది. ప్రతి ఏడాది 80లలో హీరో, హీరోయిన్లుగా రాణించిన వాళ్లు కలుసుకుంటుంటారు. ఆ సందర్భంగా గత గతేడాది 80 యాక్టర్స్ కలిసిన వేళ.. హీరోయిన్స్ సుహాసిని, రాధ, ఖుష్బూలతో పాటు జయప్రదలతో చేసిన డాన్స్ మూమెంట్స్‌ను చిరు అభిమానులతో షేర్ చేసుకున్నారు. చిరు తో అలనాటి హీరోయిన్స్ కలిసి డాన్స్ లు వేసిన వీడియో చిరు షేర్ చేసారు.
ఇందులో సుహాసినితో రాక్షసుడు సినిమాలోని మళ్లీ మళ్లీ ఇది రాని రోజు పాటకు డాన్స్ మూమెంట్స్ చేసారు. ఆ తరువాత రాధా అండ్ చిరు మరణ మృదంగంలోని సరిగమ పదనిస సాంగ్ కు మూమెంట్స్ వేశారు. ఇక కుష్బూ తో కలిసి చిరు ఘరానా మొగుడు సినిమాలోని బంగారు కోడిపెట్ట పాటకు రిథమ్ కలిపాడు. అదే సాంగ్ కు జయసుధ, జయప్రద స్టెప్స్ వేశారు. ప్రస్తుతం ఆ వీడియో ను ఫ్యాన్స్ షేర్ చేస్తూ బాగా వైరల్ చేస్తున్నారు.