బాలయ్య ఏం అన్నా పట్టించుకోలేదు!!
బాలకృష్ణ ఇప్పుడు ఇండస్ట్రీలో సెగలు రాజేసి.. కామ్ గా పుట్టిన రోజు, షష్టిపూర్తి అంటూ ఎంజాయ్ చేస్తున్నాడు. చిరు ని డైరెక్ట్ గానే కామెంట్స్ చేస్తూ.. మధ్య [more]
బాలకృష్ణ ఇప్పుడు ఇండస్ట్రీలో సెగలు రాజేసి.. కామ్ గా పుట్టిన రోజు, షష్టిపూర్తి అంటూ ఎంజాయ్ చేస్తున్నాడు. చిరు ని డైరెక్ట్ గానే కామెంట్స్ చేస్తూ.. మధ్య [more]
బాలకృష్ణ ఇప్పుడు ఇండస్ట్రీలో సెగలు రాజేసి.. కామ్ గా పుట్టిన రోజు, షష్టిపూర్తి అంటూ ఎంజాయ్ చేస్తున్నాడు. చిరు ని డైరెక్ట్ గానే కామెంట్స్ చేస్తూ.. మధ్య మధ్యలో ఇండస్ట్రీ పెద్దలని కూడా ఈ విషయంలోకి లాగుతున్నాడు. చిరు – బాలయ్య సన్నిహితులే. మంచిగా కలిసి ఉంటారు. నాగార్జున, వెంకటేష్ కి బాలయ్య దూరంగా ఉన్నప్పటికీ చిరుతో బాలయ్య సన్నహితంగా మెలుగుతాడు. బాలయ్య ఏం మాట్లాడిన చిరు బాలయ్యది చిన్న పిల్లల మనస్తత్వం అని సరిపెట్టుకుంటాడు. తాజాగా బాలయ్య తనని డైరెక్ట్ గానే ఎన్నిమాటలున్నప్పటికీ… చిరు మాత్రం అవేం మనసులో పెట్టుకోలేదనిపిస్తుంది.
అందుకే బాలయ్య పుట్టిన రోజు సందర్భంగా చిరు బాలకృష్ణ కి సోషల్ మీడియా ద్వారా విషెస్ చెప్పాడు. 60లో అడుగుపెడుతున్న మా బాలకృష్ణకు షష్ఠి పూర్తి శుభాకాంక్షలు, ఇదే ఉత్సాహం, ఉత్తేజంతో, ఆయురారోగ్యాలతో వంద వసంతాల సంబరం కూడా జరుపుకోవాలని….. ట్విట్టర్ వేదికగా చిరంజీవి,బాలకృష్ణకు ఆత్మీయ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు. మరి బాలకృష్ణ మీడియా ముఖంగా చిరు ని 80 ఏళ్ళ పార్టీకి పిలవలేదు, మా ఈవెంట్ కి దూరం పెట్టారు అంటూ చిరుని టార్గెట్ చేసినప్పటికీ.. చిరు మాత్రం సింపుల్ గా మన బాలయ్యకి అంటూ పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పడంతో మెగా ఫాన్స్ చూసారా.. మా హీరో గొప్పదనం మీరేమన్న మెం పట్టించుకోము.. అంటూ సోషల్ మీడియాలో నందమూరి అభిమానులకి కౌంటర్ వేస్తున్నారు.