చిరుకి రీమేక్ పిచ్చి పట్టిందా? లేదంటే..!!
చిరంజీవి తొమ్మిదేళ్లు రాజకీయాలంటూ సినిమాలను పక్కనబెట్టి.. కత్తి రీమేక్ తో మళ్ళి ఖైదీ నెంబర్ 150 సినిమా చేసాడు. అయితే చిరంజీవి కి స్ట్రయిట్ కథలో సినిమాలు [more]
చిరంజీవి తొమ్మిదేళ్లు రాజకీయాలంటూ సినిమాలను పక్కనబెట్టి.. కత్తి రీమేక్ తో మళ్ళి ఖైదీ నెంబర్ 150 సినిమా చేసాడు. అయితే చిరంజీవి కి స్ట్రయిట్ కథలో సినిమాలు [more]
చిరంజీవి తొమ్మిదేళ్లు రాజకీయాలంటూ సినిమాలను పక్కనబెట్టి.. కత్తి రీమేక్ తో మళ్ళి ఖైదీ నెంబర్ 150 సినిమా చేసాడు. అయితే చిరంజీవి కి స్ట్రయిట్ కథలో సినిమాలు చేస్తే హిట్ పడదని అర్థమైందా… లేదంటే సేఫ్ గేమ్ ఆడాలనుకుంటున్నాడా? అనేది అర్ధం కావడం లేదు. ఎందుకంటే చిరంజీవి ఎక్కువగా రీమేక్ లేక్ పచ్చ జెండా ఊపుతున్నాడు. సై రా దెబ్బ చిరుని మార్చేసిందా? ఏమో ఏదైనా చిరు రీమేక్స్ రీమేక్స్ అంటూ ఊగుతున్నాడు. ప్రస్తుతం చిరు ఆచార్య సినిమాని కొరటాల తో చేస్తున్నాడు. తర్వాత మలయాళ లూసిఫెర్ రీమేక్ అన్నప్పటికీ… అది పక్కనపడేసి..మెహెర్ రమేష్ తో తమిళ వేదాళం రీమేక్ చెయ్యడానికి రెడీ అవుతున్నాడు.
ఇక తాజాగా చిరు మరో రీమేక్ కి పచ్చ జెండా ఊపబోతున్నాడనే న్యూస్ మొదలైంది. అది కూడా తమిళంలో అజిత్ నంచిన సినిమానే కావడం గమనార్హం. ఎందుకంటే అజిత్ నటించిన వేదాళం రీమేక్ చెయ్యబోతున్న చిరు మళ్ళి అజిత్ మూవీ నే రీమేక్ చెయ్యడం నిజంగా షాకింగ్ అనే చెప్పాలి. తమిళంలో అజిత్ హీరోగా తెరకెక్కిన ఎన్నై అరిందాల్ (ఎంతవాడు కానీ తెలుగు డబ్బేడ్) సినిమాని చిరు రీమేక్ చెయ్యాలని చూస్తున్నాడట. ఎన్నై అరిందాల్ మీద చిరు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడంటూ సోషల్ మీడియాలో ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. మరి అజిత్ – త్రిష కాంబోలో తెరకెక్కిన ఈ సినిమా తెలుగులో డబ్ అయ్యింది. అలాగే మా టివిలో లెక్కలేనన్నిసార్లు ప్రసారమైన ఈ సినిమాపై చిరు కి అంత ఇంట్రెస్ట్ ఏమిటో. అసలు చిరు కి ఈ రీమేక్స్ పిచ్చి ఎలా పెట్టుకుందో మరి.
- Tags
- chiranjeevi