చిరు – బాబీ టైటిల్ అదా?
మెగాస్టార్ చిరు ఇప్పుడు వరస సినిమాలతో మెగా ఫాన్స్ లో జోష్ నింపుతున్నారు. ఖైదీ, సై రా సినిమాలను కూల్ గా చేసుకున్న చిరంజీవి ఆచార్య దగ్గరనుండి [more]
మెగాస్టార్ చిరు ఇప్పుడు వరస సినిమాలతో మెగా ఫాన్స్ లో జోష్ నింపుతున్నారు. ఖైదీ, సై రా సినిమాలను కూల్ గా చేసుకున్న చిరంజీవి ఆచార్య దగ్గరనుండి [more]
మెగాస్టార్ చిరు ఇప్పుడు వరస సినిమాలతో మెగా ఫాన్స్ లో జోష్ నింపుతున్నారు. ఖైదీ, సై రా సినిమాలను కూల్ గా చేసుకున్న చిరంజీవి ఆచార్య దగ్గరనుండి జోరు పెంచారు. ఆచార్య సినిమా సెట్స్ మీదుండగానే మారో మూడు సినిమాలను అనౌన్స్ చేసారు. అందులో మోహన్ రాజా లూసిఫర్ కూడా సెట్స్ మీదకెళ్ళిపోయింది. అయితే ఆచార్య సినిమా తర్వాత మెగాస్టార్ చెయ్యాల్సింది మెహెర్ రమేష్ వేదాళం. కానీ మెగాస్టార్ మాత్రం లూసిఫర్ రీమేక్ చేసేస్తున్నారు. తర్వాత చేయబోయేది మెహర్ రమేష్ సినిమానే అనుకుంటుంటే.. ఇప్పుడు దర్శకుడు బాబీ సినిమా లైన్ లోకొచ్చేసేలా ఉంది.
ఎందుకంటే నిన్నమొన్నటివరకు సైలెంట్ గా ఉన్న బాబీ – చిరు కాంబో మూవీ కి సంబందించిన న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మెగాస్టార్ చిరు – బాబీ కాంబో మూవీ టైటిల్ గా వీరయ్య అనే టైటిల్ పెట్టబోతున్నారు అంటూ.. గ్రామీణ నేపథ్యంలో సాగే కథతో సాగే ఈ సినిమాకి ఏ టైటిల్ అయితేనే పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది అంటూ ప్రచారం జరుగుతుంది. హీరో పాత్ర పేరు వీరయ్య అని అందుకే ఇదే టైటిల్ పెట్టబోతున్నారని ప్రచారం జరుగుతుంది. మరి వేదాళం రీమేక్ కాకుండా ముందు బాబీ సినిమా చిరు మొదలు పెట్టి మెహర్ కి షాకివ్వబోతున్నారా? ఏమో ఏం జరిగిన మెహెర్ చూస్తుండాల్సిందే తప్ప.. చేసేదేం లేదు.